
వరదల వల్ల, కరువు ప్రాంతాలలో నష్టపోయిన వాస్తవ సాగుదారులు, కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని సిపిఎం కేంద్రకమిటి సభ్యులు వి. శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుల వలన, వర్షాల వల్ల సంభవించిన వరదలు వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. కరువు, వరదల వలన నష్టపోయిన వారిని ఆదుకోకపోతే వ్యవసాయం గట్టెక్కదు. ముఖ్యమంత్రి వరదల ప్రాంతాలలో సందర్శించి రైతులకు ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ది చెందడం కష్టం అన్నారు. వాస్తవ సాగుదారులకు, కౌలురైతులకు అవసరం అయితే గ్రామ సభలు పెట్టి వారిని గుర్తించి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రెండు సంవత్సరాలు వర్షాలు లేక కరువుల వల్ల 1000 కోట్ల నష్టపోయార్నారు. వరదల్లో 350 కోట్లు నష్టం జరిగినట్లు ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులపై వివక్షను చూపడం సరికాదన్నారు. ఈ సమస్యలన్నిటిపై ఇప్పటికే అనంతపురంలో ఆందోళనలు, పాదయాత్రలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాపితంగా ఆందోళనలు చేయబోతున్నామని తెలిపారు. ప్రభుత్వం లక్షవరకు వడ్డీ రాయితీ కూడా ప్రకటించినా ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించడం, సందర్శింకడం, ఎరువాక కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కావని వేంటనే రైతులను ఆదుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. అమాయక ముస్తీంలపై కేసులు పెట్టడం సరైనది కాదు... గుంటూరు పోలీసు స్టేషన్ వద్ద బాలికపై అత్యాచార యత్నం ఘటన నేపద్యంలో జరిగిన యాదృచిక సంఘటన ఆదారంగా గుంటూరు 1వ పట్టణ ప్రాంతంలో ముస్లీంల పై అన్యాయంగా కేసు పెట్టిన సంగతి విధితమే. కనీసం బాధితులను పరామర్శించడానికి కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో అనుమతించలేని పరిస్థితి ఉన్నది. బాధితులను పరామర్శించే హక్కును కాలరాయడం సరైనది కాదని, ఒక పక్క ప్రభుత్వం నారా హమారా పేరుతో గుంటూరులో ముస్లీంల సదస్సును నిర్వహించబోతుందని, మరో ప్రక్క అన్యాయంగా కేసులు పెట్టించి ఎన్నికల లబ్ధి పొందే విధంగా వారిని భ్రయ భ్రాంతులకు గురి చెయ్యడం సరికాదన్నారు. వెంటనే అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.