August

కశ్మీరీ ప్రజల గొంతును వినండి మోదీ..

జమ్ముకశ్మీర్‌ పరిస్థితుల గురించి అమెరికాలో నివసించే 17ఏళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కశ్మీర్‌కు చెందిన ఫాతిమా షహీన్‌ అమెరికాలోని జార్జియాలో ఉంటున్నారులేఖలో దయచేసి కశ్మీరీ ప్రజల గొంతును వినండి.. అని మోదీని అర్థించారు. అక్కడి ప్రజల పట్ల సానుభూతి ఉంటే.. అన్ని రకాల ప్రసార మాధ్యమాలను నిలిపివేయకుండా, పరిస్థితి అదుపు చేయడానికి మరో మార్గం ఎంచుకోవాలని కోరారు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని లేఖలో కోరారు.. 

టిడిపి,బిజెపికి చిత్తశుద్ధిలేదు:కృష్ణయ్య

టిడిపి, బిజెపి నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక హోదా ఆందోళనలో టిడిపి నేతలను చంద్రబాబు పాల్గొనకుండా చేయడం దారుణమని సీపీఎం నేత కృష్ణయ్య విమర్శించారు. రాజకీయాలు ముఖ్యం కాదని ప్రత్యేక హోదా ముఖ్యమన్నారు. 

వెంకయ్య ద్రోహి..రాజీనామా చేయాలి..

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్రోహి అని వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయాలని, ప్రత్యేక హోదా కల్పిస్తేనే జీఎస్టీ బిల్లు ఆమోదిస్తామని పార్టీలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ట్రంప్‌,మోదీ ఒకేలా మాట్లాడుతున్నారు

 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకేలా మాట్లాడుతున్నారని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి కన్నయ్యకుమార్‌ విమర్శించారు. ముస్లింలు, ఇతర మైనార్టీలకు వీరిద్దరూ వ్యతిరేకమని ఆరోపించారు.అమెరికాలో ట్రంప్‌ ముస్లింలు, నల్లజాతీయులను దేశం నుంచి వెళ్లిపోవాలని చెబుతుంటే.. ఇక్కడ భారత్‌లో మోదీ కూడా ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. వారిద్దరి అభిప్రాయాలు ఒకటేనని వ్యాఖ్యానించారు.

ఆనందీ కాదు..మోడీయే కారణం:రాహుల్

గుజరాత్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాహుల్ గాంధీ విమర్శించారు. 'గుజరాత్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు 2 ఏళ్ల ఆనందీబెన్ పాలన కారణం కాదు. 13 ఏళ్ల మోదీ పాలనే కారణమ'ని  రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్‌, భాజపా సభ్యులకు విప్‌ జారీ

రాజ్యసభలో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్‌, భాజపా ఆపార్టీ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. బుధవారం రాజ్యసభ ముందకు వస్తుసేవల పన్ను బిల్లు రానున్న నేపథ్యంలో 3 రోజుల పాటు వరుసగా సభకు హాజరుకావాలని విప్‌ జారీ చేశాయి.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి..

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా  సిపిఎం శ్రేణులు ఆందోళన చేశారు.. టిడిపి పార్టీది అవకాశవాద రాజకీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు..కేంద్రం ప్రకటించిన ఎటువంటి హామీలు అమలు కాలేదని, ప్రతిపక్షాలు నిరసనలు..బంద్ లు చేపట్టవద్దని, జపాన్ తరహాలో చేపట్టాలని ప్రభుత్వం పేర్కొనడం జరుగుతోందని విమర్శించారు. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రదర్శనలు చేయవచ్చు కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు నిరసనలు..ఆందోళనలు చేయవద్దా అని ప్రశ్నించారు. అవకాశ వాద రాజకీయాల మీద బతుకుతోందని తెలిపారు.

మాజీ సీఎంలకు ఎదురుదెబ్బ

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఆరుగురికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండు నెలల్లోపు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా జస్టిస్ అనిల్ ఆర్ దవే సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.ఆదేశాలు అందుకున్నవారిలో మాజీ సీఎంలు మాయావతి, ములయాం సింగ్ యాదవ్, ఎన్డీ తివారి, కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ నరేష్ యాదవ్ ఉన్నారు

ప్రత్యేక హోదా సాధనకై రాష్ట్రవ్యాప్త బంద్

ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆగస్టు 2న జరపబోయే బంద్ లో పాల్గొనాలని కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ . నరసింగరావు ప్రజలకు  పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 అమలు చేయవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రంలో అధికారానికి వచ్చిన బిజెపి గత రెండు సంవత్సరాలు నుంచి కుంటిసాకుతో విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా జాప్యం చేసింది.విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడంలేదు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధంకావడంలేదు.

Pages

Subscribe to RSS - August