August

పుష్కర ఏర్పాట్ల పరిశీలన..

కృష్ణా పుష్కరాల్లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రతి రోజూ రూ.400 చొప్పున వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన పున్నమీ, భవానీ ఘాట్‌లలో పుష్కర ఏర్పాట్లు, కార్మికులకు అందజేస్తున్న వేతనాలు, పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ప్రతి రోజూ 35 లక్షలకు తగ్గకుండా యాత్రికులు వస్తారనీ, ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా నిధులు ఖర్చు చేసిందనీ చెప్పారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 12.70 లక్షల మందే వస్తున్నారన్నారు.

మోడీ సభకు రూ.50 కోట్లు అంచనా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను  ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోం దని అంచనా. 

జీఎస్టీ పోర్టల్ ఇన్ఫోసిస్ కు..

ఎట్టకేలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బిల్లు జీఎస్టీని రాజ్యసభ బుధవారం ఆమోదించేసింది. అయితే ప్రస్తుతం ఈ బిల్లు అమలుకు ప్రభుత్వం సిద్ధమవడమే. దీనికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించేసిందట. జీఎస్టీ బిల్లు పోర్టల్ తయారీని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అప్పజెప్పేసిందట. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్లును అమలులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి ఈ కంపెనీ జీఎస్టీకి అవసరమైన పూర్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఫ్రాక్ట్చర్ను అందించనుంది.

హోదాపై బాబుకు ముద్రగడ సవాల్

 ప్రత్యేక హోదాపై చంద్రబాబు, ఆయన తనయుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడితే.. తాను కూడా వారితో పాటు దీక్షలో కూర్చుంటానని ముద్రగడ స్పష్టం చేశారు. దీనిని సవాల్గా తీసుకొని దీక్ష ప్రారంభించి కబురుపెట్టమని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను:ఏచూరి

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను. అది పేదలపై భారం మోపుతుంది.. దానిని తక్కువగా ఉంచాలి. బడ్జెట్‌లో పరోక్ష పన్నులను రూ. 20,000 కోట్ల మేర పెంచారు. ప్రభుత్వం పేదలను పణంగా పెట్టి ధనికులను మరింత ధనవంతులను చేస్తోంది అని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు 

హైకోర్టులో షాక్.. సుప్రీమ్ కు కేజ్రీ

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.  ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 239వ అధికరణం ఇంకా అమలులోనే ఉందని, దాని ప్రకారం ఢిల్లీ ఇంకా కేంద్రపాలిత ప్రాంతమే అవుతుందని తెలిపింది. ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పకుండా మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని కూడా కోర్టు చెప్పింది. కేంద్రప్రభుత్వ అధికారులపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలు లేదని తెలిపింది. అయితే, ఈ తీర్పుతో తీవ్రంగా నిరాశ చెందిన ఢిల్లీ ప్రభుత్వం.. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

టిడిపి అంటే తెలుగు డ్రామా పార్టీ..

తెలుగుదేశం పార్టీ(టిడిపి)ని ఒక తెలుగు డ్రామా పార్టీగా కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌ అభివర్ణించారు. ప్రత్యేక హోదా సాధనలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బిరామి రెడ్డి, ఏపిసిసి చీఫ్‌ రఘువీరాతో కలసి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండు చేశారు.

మోటారు సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

దేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.

Pages

Subscribe to RSS - August