హైకోర్టులో షాక్.. సుప్రీమ్ కు కేజ్రీ

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.  ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 239వ అధికరణం ఇంకా అమలులోనే ఉందని, దాని ప్రకారం ఢిల్లీ ఇంకా కేంద్రపాలిత ప్రాంతమే అవుతుందని తెలిపింది. ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పకుండా మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని కూడా కోర్టు చెప్పింది. కేంద్రప్రభుత్వ అధికారులపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలు లేదని తెలిపింది. అయితే, ఈ తీర్పుతో తీవ్రంగా నిరాశ చెందిన ఢిల్లీ ప్రభుత్వం.. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.