
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ రక్షణశాఖ మంత్రి ములాయంసింగ్ యాదవ్ 18 ఏండ్ల నాటి రహస్యాన్ని బట్టబయలు చేశారు.తాను బోఫోర్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లను మాయం చేశానని చెబుతూ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో పడవేశారు. 1996-98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రక్షణ మంత్రిగా పనిచేసిన ములాయం ఆ ఫైళ్లను తాము ఉద్దేశపూరితంగానే దాచిపెట్టామని చెప్పారు.