పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు..

గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది. పరిస్థితులను నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ వద్ద మరో అవకాశం ఏమీ ఉండబోదని, తప్పనిసరిగా రైఫిళ్లతో కాల్పులు జరపాల్సి వస్తే, అప్పుడు మరిన్ని ప్రాణాలు పోతాయని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఆర్పీఎఫ్ తెలిపింది.