సంక్షోభంలో వ్యవసాయం:AIAWU

దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాల ద్వారా వ్వవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారంబ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం లో ఎపిరైతుసంఘం, వ్వవసాయక ార్మికసంఘం సంయుక్త అధ్వర్యంలో రైతుసంఘంజిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్‌టెబుల్‌ సమావేశం నిర్వహించారు. వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయని, వ్వవసాయ పనులు లేక రైతులు, రైతుకూలీలు, వలసలు వెళ్తున్నారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు. .రైతుల భూములను లాక్కోవటం కోసమే 2013 భూసేకరణ చట్టాన్ని మార్పుచేస్తూ మోడీ ప్రభుత్వం ఆర్డీనెన్స్‌ తెచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల అధ్వర్యంలో సెప్టెంబరు1న అన్ని మండల కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలో రైతులు పాల్గొనాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలన్నారు. వ్వవసాయ కార్మిక కుటుంభాలకు ఇళ్ల స్థలాలుఇవ్వాలని, ఆటవీ హక్కు చట్టం ప్రకారం గిరిజన రైతులకు హక్కులు కల్పించి భూమి అభివృద్దికి చర్యలు తీసుకొవాలన్నారు. ఆహరభద్రత చట్టాన్ని బలోపేతంచేయాలన్నారు.ఎఫ్‌సిఐ రద్దు ప్రతిపాధనను ఉపసంహరించాలని కోరారు. కౌలురైతులకు గుర్తింపుకార్టులు ఇవ్వాలని, పంటరుణాలు ఇవ్వాలన్నారు. ఈసందర్బంగా సెప్టెంబర్‌2న కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో రైతులు, వ్వవసాయ కార్మికులు పాల్గొనాలని రౌండ్‌టెబుల్‌ తీర్మానించింది.