విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
కర్నూలు:కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.