బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలి ... త్రిపుర ఎంపి జితేంద్ర చౌదరి ..

రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దేశంలోని సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేసే దుందుడుకుగా వ్యవహరిస్తునాయి . విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు , గిరిజన చట్టాలకు కనీసం గౌరవించకుండా ఏకపక్షంగా రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది .దీనిపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని సిపియం పార్లమెంట్ సభ్యులు జితేంద్ర చౌదరి గారు తెలియజేసారు. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే  రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

        ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తానని, ఈ ఒప్పందాలన్నీ అనైతకమని చెప్పి గిరిజనుల ఓట్లు తో గెలిచారు. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ గిరజనులను మోసం చేసే చర్యలకు పునుకుంటున్నారు. 

  రాస్ ఆల్ ఖైమా, జిందాల్ తో చేసుకున్న ఒప్పందాలు అవకతవకలు జరిగాయని గతంలో సిపియం చెప్పిన విషయాలను కంట్రోలార్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్ ) విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. విశాఖ గిరిజన ప్రాంతంలో 2005-07 మద్య బాక్సైట్ తవ్వకాలపై చేసుకున్న ఒప్పందాల్లో అవకతవకలకు పాల్పడ్డారని తెలియజేసింది. విశాఖ జిల్లాలోని బాక్సైట్ ఖనిజం మొత్తం 550 మిలియన్ మెట్రిక్ టన్నులు వుంటుంది. దీని విలువ 1 లక్ష కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా. కాని ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి చేసి అతి తక్కువ విలువ కట్టించారు. దాని ప్రకారం రూ . 11400 కోట్లుగా నిర్ణయించారు. కాని ఒప్పందాల్లో మాత్రం దాని విలువ 258 కోట్లుగా మాత్రమే ఒప్పందాల్లో పేర్కొనడాని కాగ్ త్రీవ తప్పిదంగా గుర్తించింది. దీన్ని బట్టి ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజదనాన్ని తమ తాబెదార్లకు, పెట్టుబదిదార్లకు కట్టబెట్టాలని చూసిందో అర్దమోతుంది ..

  బాక్సైట్ ఒప్పందాల్లో జరిగిన అవినీతి, అక్రమాల చోటుచేసుకున్న నేపద్యంలో ౨౦౧౨ సం'' సెప్టెంబర్ లోనే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని గిరిజన మంత్రిత్వ శాఖ సిపార్సులు చేసినా ప్రభుత్వ మంత్రి వర్గం నేటికీ రద్దు చేయకుండా పెడచెవిన పెట్టింది. గిరిజనులకు నస్తాదయకమైన బాక్సైట్ తవ్వకాలను చేపట్టాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని లేనట్లుయితే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు .. ఈ ప్రెస్ మీట్ లో సిహెచ్.నరసింగరావు , కె. లోకనాధం గార్లు పాల్గొన్నారు ..