
దేశంలోని విద్యాసంస్థలను ఆరెస్సెస్ తన గుప్పిట బంధించిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గజేంద్ర చౌహాన్‌ను పూణె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్ కబంధహస్తాల్లో సృజనాత్మకత నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని, బీజేపీని కీర్తించడమే ప్రాతిపదికగా అనర్హులకు పదవులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.