డిగ్రీలో సెమిస్టర్‌ వద్దు:SFI

డిగ్రీ కళాశాలలో సెమిస్టర్‌ విధానాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు కలిగే నష్టాలపై ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసింది.90 శాతం డిగ్రీ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇలాంటి స్థితిలో ఆరు నెలల కాలంలో నాలుగు ఇంటర్నల్స్‌, నాలుగు ప్రాక్టికల్స్‌, రెండు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. డిగ్రీలో ఉపాధి కోర్సులు ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులలను వెంటనే భర్తీ చేయాలని, సెమిస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.