
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒకేలా మాట్లాడుతున్నారని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి కన్నయ్యకుమార్ విమర్శించారు. ముస్లింలు, ఇతర మైనార్టీలకు వీరిద్దరూ వ్యతిరేకమని ఆరోపించారు.అమెరికాలో ట్రంప్ ముస్లింలు, నల్లజాతీయులను దేశం నుంచి వెళ్లిపోవాలని చెబుతుంటే.. ఇక్కడ భారత్‌లో మోదీ కూడా ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. వారిద్దరి అభిప్రాయాలు ఒకటేనని వ్యాఖ్యానించారు.