ఆందోళనలో గ్రామకంఠాల ప్రజలు..

కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు గ్రామాల్లోని ప్రజలు గ్రామకంఠాలపై ప్రభుత్వ తీరుపట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. సిపిఎం బృందం ఈ గ్రామంలో పర్యటించినప్పుడు వారి ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పంట భూములు తీసుకునేటప్పుడు తియ్యని మాటలు చెప్పి నేడు గ్రామకంఠాల పేరుతో చేదు తినిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న గ్రామానికి 500మీటర్లు అదనంగా గ్రామకంఠం కింద వదులుతానన్న ప్రభుత్వ హామీ ఏమైందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం గ్రామకంఠాల సమస్యను పరిష్కరించకుంటే పూలు వేసిన చేత్తోనే రాళ్లు వేయక తప్పదని హెచ్చరించారు.