
నారాయణ కళాశాల విద్యార్థినుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఐద్వా, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. ఐద్వా, డివైఎఫ్‌ఐలు బుధవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినులవి ఆత్మహత్యలే ఐతే, అందుకు కారణాలేమిటో కళాశాల యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని, విశ్రాంతిలేని చదువులే వారి చావులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.