UPA,NDA ఒకటే:నర్సింగరావు

అనకాపల్లిటౌన్‌: జిడిఎస్‌ ఉద్యోగుల వేతన సవరణను 7వ పే కమిషన్‌ పరిధిలోకి చేర్చకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించడానికి నిరసిస్తూ స్థానిక పోస్టాఫీసు వద్ద సి,డి,ఇ.డి. ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యాన బుధవారం పోస్టల్‌ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించిన నర్సింగరావు మాట్లాడుతూ యుపిఎ, నేడు ఎన్‌డిఎ ప్రభుత్వాల విధానాలు ఒక్కటేనని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని, వాటిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు ద్వజమెత్తారు.కార్పొరేట్‌ సంస్థల దయతో అధికారంలోకొచ్చిన మోడీ, వారి విచ్చల విడి వ్యాపారాలకు అడ్డు లేకుండా కార్మిక చట్టాలను సవరిస్తున్నారని విమర్శించారు. మోడీ తన స్వలాభం కోసం ఆ సంస్థలకు వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ దోపిడీతో దేశంలో సామాన్యులు బతకలేని స్థితిన నెలకొందన్నారు. ఇందుకు ఉదాహరణగా నోవర్టీస్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన మందును (నెల రోజులకు) లక్షా 78వేల రూపాయలకు భారత మార్కెట్‌లో విక్రయిస్తుందని తెలిపారు.