ఉల్లిపాయలు కౌంటర్లు పెంచాలి, ప్రతీ కుటుంబానికి కనీసం 4కేజీలు ఇవ్వాలి - సిపియం డిమాండ్

విశాఖనగరంలో ఉల్లిపాయలు ధరలు పెరగడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కేవలం రైతు బజార్లలో మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయ‌లు సరఫరా చేస్తున్నది. తక్కువ కౌంటర్ల వల‌న ప్రజానీకం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రోజువారి కూలిని కూడా కోల్పోతున్నారు. తక్షణం ప్రతి రైతుబజారులో కనీసం ఐదు కౌంటర్లు ప్రారంభించాలి. ప్రతి రేషన్‌డిపోలోనూ, మున్సిపల్‌ వార్డు ఆఫీస్‌ల‌ వద్ద సబ్సిడీ ఉల్లిపాయల‌ను సరఫరా చేయాల‌ని సిపియం పార్టీ కోరుచున్నది. ప్రస్తుతం త్లెరేషన్‌కార్డుదారుల‌కి మాత్రమే ప్రభుత్వం ఉల్లిపాయులు సరఫరా చేయడం చాలా అన్యాయం. వివక్షత కూడా. గులాభీరంగు కార్డుదారుల‌కు కూడా ఉల్లిపాయలు ఇవ్వాల‌ని సిపియం డిమాండ్‌ చేస్తున్నది. అలాగే ప్రస్తుతం ఇస్తున్న రెండుకేజీల‌ స్థానంలో కనీసం నాలుగు కేజీలు ఉల్లిపాయలు కుటుంబానికి ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేస్తున్నాం. కార్డులేనివారికి కూడా ఉల్లిపాయలు ఇవ్వాలి.
    నగరంలో బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు 60 రూ॥ నుండి 70 రూ॥ల‌ వరకు అమ్ముతున్నారు. వీటి ధరలు తగ్గేలా తగిన చ‌ర్య‌లుతీసుకోవాలి. బ్లాక్‌మార్కెట్లపై దాడు చేయాలి. అక్రమ నిల్వ‌ల‌ పై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తున్నాం. ఉల్లిపాయలు పంపిణీ దగ్గర రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా ఉల్లిపాయలు పంపిణీ చేయాల‌ని కోరుతున్నాం.