September

SFI నిరసనల వెల్లువ..

విశాఖ కలెక్టరేట్‌ వద్ద సమస్యలపై శాంతియుతంగా మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు నిర్వహిం చారు. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా ఎప్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యాన విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఐటిడిఏ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఎస్‌ఐ సూర్యప్రకాశరావు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అప్పారావును అరెస్టు చేశారు. అరకువేలీ, నర్సీపట్నంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు.

రాజధానిలో 144 సెక్షన్ విధించటం పౌరుల హక్కులను ఉల్లంగించటమె.

సిపియం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్భంధం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో సిపియం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని అని చెబుతున్న ప్రభుత్వం శంఖుస్థాపన జరగక ముందే అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తుందన్నారు. ఇది రాజధాని సమస్య కాదని పౌర హక్కుల సమస్యని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 1.10 లక్షల ఎకరాల భూమిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందనీ, కానీ మాస్టర్ ప్లాన్ లో మాత్రం అన్ని కార్యాలయాలకు కలిపి 155 ఎకరాలు సరిపోతుందని చూపిస్తున్నారని, మిగిలిన భుమూల్ని కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

జనం స్పందన చూసైనా స్పృహలోకి వస్తారా!

సెప్టెంబర్‌ 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. అందరి అంచనాలకు మించి కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్‌ ఉద్యోగులు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, బొగ్గు గనుల్లోనూ, రక్షణరంగ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు అత్యధిక శాతం సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ రవాణా కార్మికులతో పాటు ప్రయివేటు రంగ రవాణా కార్మికులు కూడా కలిసి దేశవ్యాప్తంగా సమ్మెచేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.

థర్మల్ పవర్ బాధితులకు అండగా..

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు.

ప్రశ్నిస్తేనే..!

న్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా, మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం అంటాడు కబీరు. మంచి మనిషిగా బతకడమంటే మౌనంగా తన దారిన తాను బతకడం కాదు. తన కళ్ళెదుటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడటం కాదు. తానొవ్వక, నొప్పింపక, తప్పించుకు తిరిగే లౌక్యం చూపడమూ కాదు. మాయలపేరిట, మంత్రాల పేరిట మూఢత్వంలోకి లాక్కెళ్ళే కుతంత్రాలను ప్రశ్నించాలి. మనిషికి క్షేమకరం కాని చెడు మీద తిరగబడే తత్వాన్ని ప్రదర్శించాలి. హేతువుకు నిలవని విషయాలను సవాల్‌ చేయాలి. హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి అందించాలి. తన చుట్టూ ఉన్న ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పాదుకొల్పాలి.

దళితుల పట్ల వివక్షా?:CPM

144 సెక్షన్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపుతున్న ప్రభుత్వ పోకడను సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం మంగళగిరిలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణను, కోస్తా జిల్లాల కన్వీనర్‌ మల్లవరపు నాగయ్య తదితర నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో కలిసి పరామర్శించారు.

అభివృద్దికి పేదలు అడ్డుకాదు..

అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్‌ ప్రాంతమైన భవానీఘాట్‌ నుండి పున్నమి హాోటల్‌ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు.

144 సెక్షన్‌ ఎత్తేయాలి: పాశం

రాజధానిలో విధించిన 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, వ్యవసాయ కార్మికులు, ఇతర భూమిలేని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ చేపట్టాలని గుంటూరులో మంగళవారం జరిగిన సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 'రాజధాని ప్రాంతంలో నిర్భంధం' అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు ప్రసంగించారు.ప్రభుత్వం రాజధాని ప్రజలకిచ్చిన ఒక్క వాగ్థానం కూడా అమలు చేయకపోగా నిర్భంధాలు ప్రయోగిస్తోంది. ఈ విధానాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఎదుర్కొవాలి.

ల్యాండ్‌ బ్యాంక్‌ వద్దు :మధు

పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా భూసేకరణ చేయడాన్ని ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి  లేఖ రాశారు. సారవంతమైన వ్యవసాయ భూములను బడా కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడం సరికాదని, ఈ విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో అవసరానికి మించి పెద్ద మొత్తంలో రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని విరమించుకోవాలని కోరారు.

జిఒ 329ను రద్దు చేయాలి

శ్రీకాకుళం జిల్లా సోంపేట చిత్తడి నేలల్లో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 329ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. చిత్తడి నేలల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించడం చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చిత్తడి నేలల సంరక్షణ చట్టంలోని 4 (1) (ఱఱ) ప్రకారం బోట్‌ జెట్టీ తప్ప, ఇతర ఏ కట్టడమూ నిర్మించరాదని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.

Pages

Subscribe to RSS - September