September

విద్యారంగ స్వేచ్ఛకు ప్రమాదం..

 ఈమధ్య పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటం గురించి మీడియాలో చూస్తున్నాం. ఆ సంస్థకు అధ్యక్షుడిగా గజేంద్ర చౌహాన్‌ను, ఆయనతోపాటు మరో ముగ్గురిని పాలక మండలి సభ్యులుగా నియమించటాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆ సంస్థతో సంబంధంలేని ఇతర సినిమా రంగ నిష్ణాతులు కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆయనకున్న అర్హతల్లా ఆయన మోడీపై సినిమా తియ్యటమే. దానితోపాటు మహాభారతం టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రను పోషించాడు. ఒకప్పుడు మహామహులు నిర్వహించిన ఆ బాధ్యతలోకి రావటానికి ఈ అర్హతలు ఏమాత్రం సరిపోవు.

చిత్తూరు జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి.

చిత్తూరు జిల్లాలో కరువు  తీవ్రమై ప్రజల జివీతం చిన్న భిన్నమయి అల్లాడుతూ, త్రాగడానికి  మంచి నీరు లేక, పశువులను అమ్ముకుని ఉపాధి కోసం పల్లెలాలను వదలి పట్టణలకు వలసలు వెళుతున్నారు . వేలాది ఎకరాల మామిడి చెట్లు  నిలువునా యన్దిపోతున్నాయి. ప్రభుత్వం నిమ్మకునిరేతినట్లు వ్యహరిస్తున్నది. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్ట్లని సి పి యం, సి పి ఐ పార్టీ నాయకులూ సమావేశం లో ప్రభువాన్ని  డిమాండ్ చేసారు .  

200 ఎకరాలు స్వాహా..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి.

ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రారంభం

కాకినాడ సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను జడ్‌పి ఛైర్మన్‌ నామన రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంతోపాటు సమాజ మార్పునకు పుస్తక పఠనం దోహదం పడుతుందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ 'నేను మలాలా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కౌలు చెక్కులు, సమాన ప్యాకేజి ఇవ్వాలి..

అసైండ్, సీలింగ్ సాగుదారులకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని , పట్టాభూమితో సమాన ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ అమరవతి (రాజధాని) ప్రాంతంలో సిపిఎం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు..శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులు, సిపిఎం నాయకుల్ని పోలీసులు  అక్రమంగా అరెస్టులు చేసి స్టేషనుకు తరలించారు.వీరిపై 144 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసారు. 

14 FDIలకు ఆమోదం..

వివిధ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లకు సంబంధించి 14 ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదముద్ర వేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికంఠదాస్‌ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఎఫ్‌డిఐలకు సంబంధించిన 23 ప్రతిపాదనలను పరిశీలించిన బోర్డు నాలుగు ప్రతిపాదనలను తిరస్కరించింది, ఐదింటిపై నిర్ణయం వాయిదా వేసింది. బోర్డు ఆమోదించిన ప్రతిపాదనల్లో శ్యామ్‌ సిస్టెమా టెలి సర్వీసెస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ తదితర సంస్థలకు చెందిన ప్రతిపాదనలున్నాయి.

పోర్టుకి ప్రభుత్వమే అడ్డు:CPM

బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాఫీగా సాగుతున్న పోర్టు నిర్మాణ పనులకు రాత్రికిరాత్రే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేసి గ్రామాల్లో అలజడి సృష్టించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 వేల ఎకరాల్లో పోర్టు నిర్మించవచ్చన్న టిడిపి నాయకులు, ఇప్పుడు 30 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేశారో చెప్పాలని ప్రశ్నించారు.

రైతుల పరిస్థితి దయనీయం..

రాజధానికి భూములిచ్చిన రైతుల జీవనస్థితి మారిపోతోంది. భూములిస్తే అకాశ హర్య్మాలు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తదనుగుణంగా కనీస శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో వారు గేదెలు కాసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాగులేక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. తోటల్లో పిచ్చిచెట్లు మొలిచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. మాగాణుల్లో మోకాళ్ల ఎత్తున గడ్డి మొలిచింది. వాటిని చూసి రైతులు చలించిపోతున్నారు. కొద్దిపాటి మొత్తాన్ని వెచ్చించి రైతులు ఒకటీ లేదా రెండు గేదెలు కొనుగోలు చేసుకున్నారు. సాగు చేసిన పొలాల్లోనే వాటిని మేపుకొంటూ కాలం గడుపుతున్నారు.

ఉపాధిహామీ సంగతేంటి? :VSR

అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వ్యవసాయ కార్మికులతో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు మమేకం కావాలని రైతుసంఘం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.300 వేతనం అందించాలని వర్క్‌షాప్‌ తీర్మానించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. వలసలు నివారిస్తామని, ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని చూపిస్తామని చట్టంలో పేర్కొన్నా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

Pages

Subscribe to RSS - September