వాట్సప్‌పై కేంద్రం వెనకడుగు..

 జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానంపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఎన్‌క్రిప్షన్‌ ముసాయిదా స్థానంలో సవరించిన సంకేత/సంక్షిప్త(ఎన్‌క్రిప్షన్‌) ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించినది కేవలం ముసాయిదా మాత్రమేనని.... ప్రజల నుంచి అందిన సూచనల మేరకు మార్పులు చేసి త్వరలో తాజా విధానాన్ని అందుబాటులోకి తీసువస్తామని ఆయన చెప్పారు. సాధారణ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధానముంటుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానం ముసాయిదాను ప్రకారం వాట్సప్‌, గూగుల్‌ హ్యాంగౌట్‌ ద్వారా వచ్చే సందేశమేదైనా సరే... కనీసం 90 రోజులపాటు ఫోన్‌లో భద్రపరచుకోవాలి. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం పునరాలోచనలో పడింది.