September

కార్పొరేట్ల సేవలొ కేంద్ర రాష్త్ర ప్రభుత్వలు:- వి.కృష్ణయ్య

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు.

మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల‌ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల‌పై విశాఖనగరంలో కార్మికుల‌ సమ్మె విజయవంతం

2015 సెప్టెంబ‌రు 2
    దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు అనుస‌రిస్తున్న‌ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల‌కు మేం వ్యతిరేకం అని కార్మికవర్గం చాటిచెప్పింది. నేడు దేశవ్యాపితంగా అఖిల‌భారత సమ్మెలో విశాఖనగర కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేసింది.

‘లాజిస్టిక్‌ హాబ్‌ ’ భూ సేకరణ సాగుదార్ల సమస్యు పరిష్కరించాలి.

     ఈ రోజు సిపియం పార్టీ నాయకులు లాజిస్టిక్‌ హబ్‌ భూ సాగుదార్లు, జిల్లా కలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి నష్టపరిహారం విషయంలో సాగుదార్లుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యన్నారాయణ, గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ విషయంపై కలెక్టర్‌ స్పందించి భూ సాగుదార్లు అందరికీ చట్టం ప్రకారం రావల్సిన పరిహారాన్ని, బాధిత కుటుంబాలకు కూడా న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 

రైతులకు న్యాయం చేయాలి..

పంచగ్రామాల భూసమస్యపై టిడిపి ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. కేబినెట్‌ ప్రకటనతో కేవలం 12149 మందికే ఉపశమనం లభిస్తుందని, మరింత ఉదారంగా వ్యవహరించి జిఒ జారీ చేస్తే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరగుతుందన్నారు. 60 గజాల లోపు వరకు ఉన్న నివాసాలను మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరించి, మిగిలిన వాటిని వర్గీకరించి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అక్కడితో ఆగకుండా 61 నుంచి 300 గజాల వరకు 1998 నాటి భూ విలువలో 70 శాతం డబ్బులపై 9 శాతం వడ్డీ కట్టాలని ప్రకటించడం సబబు కాదన్నారు.

సింగపూర్‌ షరతులు..!

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలంటే అందుకు ప్రతిగా అవి వాటికోసం కోరుకున్న భూములనూ సర్వ హక్కులతోనూ ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కంపెనీల షరతులు:తమకు కేటాయించే భూములపై పూర్తి హక్కులూ తమకే అప్పగించాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని రాజధాని నిర్మాణం చేపట్టదలచిన కంపెనీలు తెలిపినట్లు తెలిసింది. 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇచ్చినా భూమిపై హక్కులు తమకే ఉండాలని, అందుకు అవసరమైన డాక్యుమెంట్లున్నీ అప్పగించాలని సింగపూర్‌ ప్రతినిధులు షరతు పెట్టినట్లు సమాచారం.

అసెంబ్లీ ముట్టడి:APరైతుసంగం

 రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజుకొని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురువారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరుతో 53 వేల ఎకరాలు సేకరించాలని 45 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని కోసం మొత్తం 1.40 లక్షల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.

జిఓ20ని రద్దు చేయాలి: SFI

రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జిఒ నంబరు 120ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో సర్కిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీ వైద్యకళాశాలలో సీమ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20శాతం సీట్లు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం కొత్తగా జిఒ నంబరు 120 తీసుకు వచ్చి లోకల్‌కు 20శాతం, నాన్‌లోకల్‌కు 80శాతం సీట్లు కేటాంచే విధంగా అవకాశం కల్పించారని విమర్శించారు.

వృద్ధి రేటుకు కోతలు..

పారిశ్రామికోత్పత్తిలో క్షీణత, పెట్టుబడుల్లో స్తబ్దత నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలకు గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీలు కోత పెట్టాయి. ప్రజల కొనుగోలు శక్తిలో పెద్ద మార్పులు లేకపోవడం, ఉత్పత్తులకు డిమాండ్‌ లేకపోవడంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును 7 శాతానికి అంచనా వేశాయి. ఇది వరకు ఈ వృద్ధి రేటును 7.5 శాతంగా ఉంటుందని పేర్కొన్నాయి. వచ్చే మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.1 శాతానికి పరి మితం కావచ్చని యుబిఎస్‌, 7 శాతానికి తగ్గొచ్చని మూడీస్‌ సంస్థలు వేరు వేరుగా వెల్లడించాయి.

Pages

Subscribe to RSS - September