September

ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల ప్రజలపై భారం- సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు

-  చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
-  ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
-  పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
-  విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
-  నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన మొదలైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. 76,4260 ఎకరాలను కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్దమైందని ఆయన ఆరోపించారు. కార్మికసంక్షేమం పక్కన పెట్టడం వల్లనే ప్రపంచ బ్యాంకు పెట్టుబడి అనుకూలత రాష్ట్రముగా రెండం స్థానం ఏపీకి వచ్చిందని తెలిపారు. సర్కారు బలవంతపు భూసేరణ పై త్వరలో భారీ ఉద్యమం నిర్మించి రాష్ట్ర బంద్ కు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని మధు తెలిపారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యుటివ్ గా పేరు తెచ్చుకున్న బాబు మరో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలుపరస్తున్నారని మధు దుయ్యబట్టారు.

ప్రైవేటురిజర్వేషన్ల కోసంKVPS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల్లో సామాజిక న్యాయం లేకపోవడంతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు, ఉన్న ఉద్యోగాలకు భద్రత సన్నగిల్లుతున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ భవన్‌లో బుధవారం కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు.

భ్రమ-వాస్తవం

తెగించి పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామిక వేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి అద్దం పడుతోంది. పెట్టుబడిదారులతో పాటు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నష్టాలను భరించే శక్తి ప్రైవేటు రంగానికే ఉంటుందని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రధానమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు ఆశావహ ధృక్పథాన్ని కాకుండా దానికి భిన్నమైన నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తుండటం గమనార్హం.

ప్రభుత్వ భూదందా సాగదు:రఘు

పారిశ్రామిక అభివృద్ధికే భూసమీకరణ అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టును అడ్డం పెట్టుకుని పరిశ్రమల పేరుతో పెద్దఎత్తున భూములు లాక్కొంటోందన్నారు. అక్కడ వేలాది ఎకరాలను దశాబ్దాల తరబడి స్థానికులు సాగు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ భూదందాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. టిడిపి, కారగ్రెస్‌ నేతలపై జరిగిన తిరుగుబాటే దీనిని నిదర్శనమన్నారు.

TDP మట్టిమాఫియా:దడాల

అధికార పార్టీ నాయకులు, మట్టిమాఫియా, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రామేశంపేట మెట్ట భూమిలో మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తంచేశారు. రామేశంపేట మెట్ట భూముల దళిత రైతులు సిపిఎం ఆధ్వర్యాన పెద్దాపురం తహశీల్దార్‌, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల మాట్లాడుతూ దళితులకు ఉపాధి నిమిత్తం ఇచ్చిన అసైన్డ్‌ భూములను 9/77 యాక్టు ప్రకారం అమ్మకాలుగానీ, కొనుగోళ్లు గానీ చేయకూడదన్నారు. జిఒ 2/2013ను చూపించి చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

ఆశావర్కర్లకి అండగా సిపిఎం

పెండింగ్‌ వేతనాలు, పారితోషకాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆశావర్కర్లు తూర్పుగోదావరి జిల్లా చింతూరు రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి మాట్లాడారు. ఎంఎల్‌ఎ, ఎంపీల ఇంటి అద్దె అలవెన్సు పెంచుతున్న ప్రభుత్వం తక్కువ వేతనంతో కాలం వెళ్లదీస్తున్న ఆశాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ముంపు మండలాల కార్మికుల సంక్షేమం పై శద్ధ చూపడంలేదన్నారు. తహశీల్దార్‌ శివకుమార్‌ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు.

Pages

Subscribe to RSS - September