September

రైతు క్షోభ పట్టని సర్కారు..

జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా వాటిని ఏలికలు అలవోకగా తీసుకోవడం దుర్మార్గం. అన్నపూర్ణగా అభివ ర్ణించే ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల బలవన్మరణాలు మరింత ఆందోళన కరం. రాయలసీమలో సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 32 మంది కర్షకులు విధి లేని పరిస్థితుల్లో మరణాన్ని ఆశ్రయించినా ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం సైతం లేకపోవడం దారుణం. సీమలో రైతు ఇంట చావు డప్పు ఇప్పటికిప్పుడు తలెత్తిన ఉత్పాతం కాదు. దశాబ్దంన్నర నుంచీ పరంపర కొనసాగుతూనే ఉంది. టిడిపి, కాంగ్రెస్‌, మళ్లీ టిడిపి పాలక పార్టీలు మారాయి తప్ప పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు సరి కదా అంతకంతకూ దిగజారుతున్నాయి.

నిర్మాణ పనులన్నీ గోప్యం..!

రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వ్యాపార ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సింగపూర్‌లో సిఎం బృందం ఇటీవలి పర్యటనలో పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సిఆర్‌డిఎ పరిధిని పెంచారనే వార్తలూ వస్తున్నాయి. రెవెన్యూ శాఖను పక్కన పెడుతునట్టు, మున్సిపల్‌శాఖలో అధికారులను ఒక్కొక్కరిని మార్పు చేస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల్లోనూ సంబంధిత అధికారులకు సమాచారం ఉండటం లేదు.

మాన్సాస్‌కు కట్టబెట్టొద్దు:CPM

 జిల్లాకేంద్రంలోని పెద్దాసుపత్రిని ప్రయివేటు సంస్థ మాన్సాస్‌కు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన గురువారం ధర్నా చేశారు. ఆసుపత్రి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి లేని జి ల్లా విజయనగరమేనన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు కూడా జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఏర్పాటు చేస్తామని ప్రకటిం చారని తెలిపారు.

భూసేకరణను అడ్డుకుంటాం..

ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు పాలించాలా? శాసించాలా?

''మానవుడు స్వేచ్ఛగా జన్మించి తర్వాత సంకెళ్ళలో బంధింపబడతాడు'' అని ఓ తత్వవేత్త ఉడ్రోవిల్సన్‌ అంటాడు. ఇది నేటికీ నిజమే! స్వేచ్ఛాయుతమైన జీవనం గడిపేందుకు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. స్వేచ్ఛ అంటే ఎదుటి వారికి హాని కలిగించని ఏ పనైనా చేసుకునే వెసులుబాటు అని చిన్నప్పుడు మాస్టారు చెప్పారు. ఇప్పుడది అర్థం మారి ప్రభుత్వం చెప్పినట్టు వింటేనే స్వేచ్ఛ, లేదంటే ధిక్కారం అంటున్నారు. రాజ్యం ఏర్పడింది సమాజ శ్రేయస్సుకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మాత్రమే. ప్రభుత్వాలు ఏర్పరచుకున్నది ప్రజలను పాలించడానికే కానీ శాసించడానికి కాదు. పాలించడం, శాసించడం మధ్య చాలా వ్యత్యాసముంది.

దేవినేని ఉమా మాట్లాడడేం:YV

సుబాబుల్‌ బకాయిలు తక్షణమే చెల్లించేలా మంత్రులు స్పందించకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృ తంగా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు (వైవి) సూచించారు. కృష్ణాజిల్లా నంది గామ ఏఎంసి కార్యాలయం వద్ద సుబాబుల్‌ రైతులు చేస్తున్న ఆందోళన బుధవారానికి మూడోరోజుకు చేరింది. రైతులు వంటా వార్పూ నిర్వహించారు. వారి ఆందోళనకు మద్దతుగా వైవి ప్రసంగించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు ఎస్‌పిఎం కంపెనీ రూ.15కోట్లకు పైగా బకాయి పడిందన్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోనే సుమారు రూ.9.5 కోట్ల బకాయిలు పేరుకుపోయినా పాలకులు స్పందించకపోవటం సిగ్గు చేటన్నారు.

తుళ్లూరులో స్వీయ గృహదీక్షలు..

అసైన్డ్‌, సీలింగు భూముల లబ్ధిదారులకు పరిహారం చెక్కులివ్వాలని రాజధాని ప్రాంత పేదలు వినూత్న నిరసనకు దిగారు. బహిరంగ నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, అరెస్టులకు పాల్పడుతుండటంతో పేదలు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని స్వీయ గృహ దీక్ష చేపట్టారు. దాదాపు 30 చోట్ల వందలాది మంది మహిళలు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోమని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో మోహరించారు.ఈ దీక్షలకు క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మద్దతు ప్రకటించారు.

దళితులను పట్టించుకోరా?

 తరతరాలుగా సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని ఏ ప్రభుత్వమైనా ప్రచారం లంకించుకుంటే అంతకన్నా మోసం ఉండబోదు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లయినా అన్నింటా దళితులు అట్టడుగున ఉన్నారంటే ఏలికల వైఫల్యమే కారణం. దళితుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు అనంతరం వారిని, వారికి ఇచ్చిన హామీలను విస్మరించడం దుర్మార్గం. పాలకుల నయవంచన వల్లనే దళితుల బతుకులు నానాటికీ తీసికట్టు అవుతున్నాయి. అంటరానితనాన్ని రూపు మాపాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఉద్యమించగా, ఆయన ఫొటో పెట్టుకొని ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి మినహా ఆయన ఆశయసిద్ధిని వంటబట్టించుకున్న దాఖలా లేదు.

Pages

Subscribe to RSS - September