September

సిపిఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు

ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాలకు రాఘవులు హాజరయ్యారు.ఏపీకి 'భిక్షం' మాదిరిగా కేంద్రం అరకొర నిధులు కేటాయిస్తే వాటికోసం చంద్రబాబునాయుడు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు.

అభివృద్ధి పేరుతో భూదందా:CPM

అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూ దందా నిర్వహిస్తోందని, ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన వేల ఎకరాలు భూములు ప్రయివేటు వ్యక్తులకు, విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. స్థానిక టీచర్స్‌ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ హాల్లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సిపిఎం డివిజన్‌ సెక్రటేరియట్‌ సభ్యులు చిరుమామిళ్ల హనుమంతురావు అధ్యక్షత వహించారు. ఇందులో పలువురు మేధావులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు క్రీడా కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు దీనిపై మాట్లాడారు.

ప్రభుత్వాలదే భాద్యత:AIKS

ప్రభుత్వ విధానల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అభిప్రాయపడింది. అఖిల భారత చెరకు రైతుల సంఘం తొలి మహాసభ తమిళనాడులోని ముధురై పట్టణంలో ఆదివారం ప్రారంభమైంది.  ఈ సందర్భంగా విజ్జూక్రిష్ణన్‌ మాట్లాడుతూ ప్రపం చంలో బ్రెజిల్‌ తర్వాత చెరకు ఉత్పత్తిలో ఇండియాదే రెండో స్థానమ న్నారు. చక్కెర వినియోగంలోనూ అదేస్థానంలో ఉన్నామన్నారు. అధికారంలోకి వస్తే చెరకు ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి ధర నిర్ణయిస్తామన్న మోడీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడంలో విఫల మైందన్నారు. పెరిగిన ఎరువుల ధరలు, ప్రభుత్వ విధానల వల్లే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.

జాషువా 120వ జయంతి వేడుకలు

కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేస్తూ తన సాహిత్యం ద్వారా సాంఘిక అసమానతలపై పోరాడి పద్యానికి ప్రాణం పోసిన మహాకవి గుర్రం జాషువా రచనలపై మరోసారి అధ్యయనం జరగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా ఆదివారం ఎసి కళాశాలలో 'జాషువా సమగ్ర రచనలు - సమాలోచన' అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సుల్లో సాహితీ వేత్తలు, అభ్యుదయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె యస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. సభలో దళిత తత్వవేత్త డాక్టర్‌ కత్తి పద్మారావు మాట్లాడుతూ..

రాజధాని మాస్టర్‌ప్లానంతా బూటకం..

రాజధాని నిర్మాణానికి రూపొందించామంటున్న మాస్టర్‌ప్లానంతా బూటకమని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌. బాబూరావు విమర్శించారు.విజయవాడ ప్రాంతంలోనే రాజధానంటే అంతా ఆనందపడ్డారని, కానీ ప్రభుత్వ విధానాలను చూసి రాజధాని ఇక్కడెందుకంటూ ప్రజలు మనోవేదన చెందుతున్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్‌డిఎ పరిధిలోని 59 మండలాల భూముల్ని అగ్రికల్చర్‌ ప్రొటెక్షన్‌ జోన్‌గా ప్రకటించి, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోం దన్నారు. గ్రీన్‌ బెల్డ్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంతంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికిగాని, ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం గాని కుదరదన్నారు.

ప్రైవేటుకు ప్రభుత్వాస్పత్రులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ ఆగస్టు 8 సమావేశంలో వైద్య విద్య సమీక్ష పేరుతో ఇప్పటికే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని 'ఆపోలో'కు అప్ప గించిన విధంగానే ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్య కళాశాలలకు అప్పగించడం దుర్మార్గం. ఇది జాతి సంపదను ప్రైవేటు వారికి అప్పగించడమే. సుమారు రూ.1,000 కోట్ల విలువ చేసే జిల్లా ప్రభుత్వ వైద్యశాలలను అప్పనంగా ప్రైవేటుకు కట్టబెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వమైనా ప్రజా సంపదను కాపాడాలి తప్ప హరించడం అన్యాయం.

టీచర్‌పోస్టులుభర్తీచేయాలి:DYFI

డిఎస్‌సి -2014 ఫలితాలపై ప్రభుత్వం వెంటనే మెరిట్‌ లిస్టు ప్రకటించి టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మాధవ్‌, ఎం.సూర్యారావు ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట ఉన్న ఉపాధ్యాయులతోనే సరిపెట్టి, మిగిలిన వారిని వేరే శాఖలో నియమిస్తామని చెబుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో క్వాలిఫెడ్స్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉమారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరిట్‌ లిస్టు ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

కరువు కోరల్లో కర్నూల్..

జిల్లాలో వర్షాభావ పరి స్థితుల వల్ల వ్యవసాయం దెబ్బ తిందని, ఉపాధి కూలీలకు పనులు దొరకడం లేదని, ఈ నేపథ్యంలో కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సుదర్శనవర్మ స్మారక భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కరువు పరిస్థితి నెలకొంటే ముఖ్య మంత్రి విదేశీ పర్యటలకు ఎక్కువ సమయం కేటాయి స్తున్నారని అన్నారు. వేల, కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వెచ్చించి చేపట్టిన హంద్రీనీవా పనుల్లో మామూళ్ల కోసం నాణ్యతను పట్టించు కోకుండా నాసిరకంగా నిర్మాణం చేపటా ్టరన్నారు.

మక్కాలో 700మంది పైగా మృతి

మక్కాలో మహా విషాదం చోటు చేసుకుంది. హజ్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 700 మందికిపైగా మరణించారు. చివరిరి అంకమైన 'జమారత్‌'కోసం మక్కాకు సమీపంలోని'మీనా' (సైతాన్‌ శిల) వద్దకు చేరుకున్న వేలాది మంది యాత్రికులు గురువారం తొక్కిసలాటకు గురి కావటంతో దాదాపు 715 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య 800 మందికి పైగానే వుంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Pages

Subscribe to RSS - September