September

APప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

దేశానికి అన్నంపెట్టే అన్నదాతల ఆత్మహత్యలను ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు ? రైలు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అధ్యయనం చేస్తారు ? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ? ఈ విషయాలపై తమకు పూర్తి సమాచారం కౌంటర్‌ రూపంలో దాఖలు చేయాలని ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశిం చింది.

మంత్రి తీరుపై సీపీఎం ఫైర్

పేదలకు ఉచితంగా సేవ చేయాలని వైద్యులకు సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు వైద్యరంగం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు సేవచేయాలని సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రభుత్వం అందుకు విరుద్ధ్దంగా ఎందుకు పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యతని అన్నారు.

అర్థరాత్రి CITUనాయకుల అరెస్ట్

విశాఖలోని గంగవరం పోర్టులో మృతి చెందిన కార్మికుడు రాజారావు కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు సోమవారం ఆర్ధరాత్రి దాటాక పోర్టు గేటు వద్ద ఉన్న 130 మంది కార్మికులు, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. రాజారావు విధి నిర్వహణలో ఉండగా సోమవారం మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు నష్ట పరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కార్మికులు మృతదేహంతో పోర్టు గేటు వద్ద బైఠాయించారు.

సీపీఎం నేతలపై పోలీసుల నిఘా..

తెలంగాణలో చలో అసెంబ్లీ సందర్భంగా ఏపీ సరిహదుల్లో ఉన్న సీపీఎం నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పీఎస్ కు హాజరు కావాలని జగ్గయ్య పేట ఎస్ఐ సీపీఎం నేతలను ఆదేశించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల తరపున పోరాడే సీపీఎం నేతలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు.

అర్భన్‌హెల్త్‌ సెంటర్స్‌ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి

జిల్లాలోని అర్భన్‌ హెల్త్‌ సెంటర్ల ఉద్యోగుల ఆరు నెల్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ కోరారు. సోమవారం ఎపి అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.పద్మజారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ జీతాల్లేక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిలల్ల స్కూల్‌ ఫీజులు కట్టలేక, కుటుంబాలు గడవక ఉద్యోగులు అప్పుులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను మలాల పుస్తకావిష్కరణ సభలో ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి

అతిచిన్న వయస్సులోనే తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవటమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలు అభివృద్ధివైపు పయనించాలంటే విద్యకు మించిన మార్గం లేదని మలాల ఇచ్చిన పిలుపును మనమంతా అందిపుచ్చుకోవాలని ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. సోమవారం వివిఐటి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రపంచ దేశాలు యుద్దాలకు ఖర్చుపెట్టే సొమ్మును విద్యాభివృద్ధికి మళ్లించాలని చెప్పిన మలాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ముసుగు తొలగిన చంద్రబాబు..

''ఎట్‌ లాస్ట్‌ ది క్యాట్‌ ఈజ్‌ అవుట్‌ ఆఫ్‌ ది బ్యాగ్‌'' అనేది ఆంగ్ల సామెత. '' పిల్లి చివరికి సంచిలో నుంచి బయటపడింది'', అని దీని అర్థం. నిరంతరం అబద్ధాలు చెబుతూ, ఎదుటి వారిని మోసం చేస్తూ బతికేవారి నిజస్వరూపం బట్టబయలైనప్పుడు ఈ సామెతను ఉదహరి స్తుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సామెత అతికి నట్లు సరిపో తుంది. రాజధాని భూ సమీకరణకు సంబంధిం చి నిన్నటి వరకు ఆయన చెప్పిన మాటలు, నిన్న చేసిన ప్రకటన చూస్తే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారో స్పష్టమౌతున్నది.

ఐరాస లక్ష్యాలు నెరవేరెేనా..

 వచ్చే పదిహేనేళ్లలో ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయాలన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) లక్ష్యం మంచిదే కానీ దేశాల చిత్తశుద్ధి, సమిష్టి కార్యాచరణ పైనే అనుమానం. దశాబ్దంన్నర క్రితం 2000 సంవత్సరంలో ఐరాస తీసుకున్న సహస్రాబ్ది లక్ష్యాల్లో చాలా మట్టుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఐరాస టార్గెట్లను అమెరికా ఇతర పశ్చిమ దేశాలు తుంగలో తొక్కి తమ స్వంత ఎజెండాతో మున్ముందుకెళుతున్నప్పుడు ఎన్ని నూతన ఎజెండాలు రూపొందించినా ఆశించిన మార్పు రాదన్నది స్పష్టం. అందుకే పేదరిక నిర్మూలన లక్ష్యంగా తాజాగా ఐరాస ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామకంఠాల సమస్యకు పరిష్కారం ఎపుడో..

గ్రామకంఠాల సమస్యలను వారంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి, మంత్రులు భావించినా నెల దాటిపోయింది. గత నెల 20వ తేదీన భూ సేకరణ ప్రకటన విడుదల చేశారు. వెంటనే వరసుగా గ్రామాల్లో సిఆర్‌డిఏకు అవసరమైన భూముల తుది జాబితాలను 9.5 ఫారం రూపంలో అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్క సారిగా గ్రామాల్లో కలకలం చెలరేగింది. రైతులు సిఆర్‌డిఏ కార్యాలయాలను ముట్టడించారు. కొన్ని చోట్ల తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు శిక్షణలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను ఆఘమేఘాలపై పిలిపించారు. గత నెల 24 నుంచి ఈ సమస్యపై ఆయన దృష్టి సారించారు.

చిరస్మరణీయుడు జాఘవా:గఫూర్‌

 తెలుగు భాషా వికాసానికి గుర్రం జాషువా విశేష కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ కొనియాడారు. తన అద్వితీయ కవిత్వం ద్వారా ప్రజలందరి ఐక్యతకు తెలుగు కవితా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకు న్నారన్నారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 120వ జయంతి విజయవాడలోని సిఐటియు నగ ర కార్యాలయంలో సోమవారం జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి గఫూర్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు అధ్యక్ష తన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ, అభ్యుదయ భావాలతో సాగిన ఆయన రచనలు నేటితరానికి ఆదర్శప్రా యమన్నారు.

Pages

Subscribe to RSS - September