September

విద్యాసంస్థల్లో భారత్‌కు చివరి స్థానం

ఆసియాలోనే అత్యంత ఇన్నోవేటివ్‌ విశ్వవిద్యాలయాల్లో చైనా, భారత్‌ల కంటే చిన్న దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాల విద్యాసంస్థలు అగ్రపథాన నిలిచాయి.రాయిటర్స్‌ విడుదల చేసిన తొలి 75 ఆసియా అత్యంత నవ్యపథ విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్‌కు దక్కింది చిట్టచివరిలోని 72, 73 స్థానాలు(ర్యాంకులు). 

15 ఏళ్ల తరువాత వియాత్నం కు

వియత్నాంలో భారత ప్రధాని పర్యటించనుండటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వియత్నాం నుంచి మోదీ చైనాలోని హాంగ్‌ఝౌకు శనివారం బయలుదేరి వెళ్తారు. ఈ నెల 4, 5వ తేదీల్లో అక్కడ జరగనున్న ‘జి-20’ సదస్సులో పాల్గొంటారు.

బెదిరింపులు లెక్కచేయని ఉద్యోగులు

కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు శుక్రవారం సంపూర్ణంగా సమ్మె నిర్వహించారు. రిజర్వ్‌ బ్యాంక్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గన్నారు. నాబార్డ్‌ ఉద్యోగులు కూడా పాల్గని సమ్మెను విజయవంతం చేశారు.పశ్చిమ బెంగాల్‌లో స్థానిక యంత్రాంగం, పోలీసుల నుండి బెదిరింపులు ఎదురైనప్పటికీ బ్యాంకు, నాబార్డ్‌ ఉద్యోగులు వాటిని లెక్క చేయక సమ్మెలో పాల్గని జయప్రదం చేశారు

చంద్రబాబుకు హైకోర్టులో వూరట

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో వూరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి విచారణ కోసం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించించిన హైకోర్టు విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది.

విజయవాడలో కార్మికుల భారీ ర్యాలీ..

దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో రథం సెంటర్ నుంచి  లెనిన్ సెంటర్ వరకూ కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

దొంగ చేతికే తాళాలిచ్చిన ఐరాస..

జెనీవాలోని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్‌-బిన్‌-హస్సాద్‌ ట్రాద్‌ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షునిగా ఎన్నిక వటం ప్రపంచ దేశాలను విస్మయా నికి గురిచేశాయి. ఈ ఎన్నికను అభ్యుదయ ప్రజాస్వామికవాదులంతా నిరసన తెలియజేస్తు న్నారు. కానీ సౌదీ మిత్ర దేశమైన అమెరికా మాత్రం అభినందనలు తెలుపుతూ సంబరాలు తెలియజేసుకుంటు న్నది. సౌదీ అరేబియాకు మానవహక్కుల కమిషన్‌ అధ్యక్ష పదవి దక్కటమంటే దొంగచే తికి ఇంటి తాళాలిచ్చి కాపలాకాయమనడం తప్ప మరొకటి కాదు. జులైలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ గోప్యంగా ఉంచారు. ఈ విషయం సెప్టెంబరు 17 వరకు బయటి ప్రపంచా నికి తెలియదు.

మద్యపానం నిషేధించాలి:ఐద్వా

మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారస్తంభం సెంటర్లో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రమణి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యానికి పోరాడాలన్నారు. మద్యం వల్ల హింస పెరిగిపోతోందని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని అన్నారు. మద్యపానం నిషేధించే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు

హామీలన్నీ నీటిమూటలే:దడాల

 ప్రయివేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక యుటిఎఫ్‌ భవనంలో జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్‌ అధ్యక్షతన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) జిల్లా వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సమస్యలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టడం లేదన్నారు. గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దళితులకు అందని ద్రాక్షగా ఉన్నాయన్నారు.

Pages

Subscribe to RSS - September