ఆక్వా ఫుడ్ పార్క్ ,దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం

 కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.దివీస్ కంపెనీకి భూములు ఇవ్వని రైతులపై కిరాతకంగా దాడులు చేయడం దారుణమన్నారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చే భూములకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదని తెలిపారు.రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. తుండూరు ఆక్వాఫుడ్‌ పార్క్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో 37 వేల ఎకరాల భూమిని సేకరించారని.. అందులో 1 శాతం భూమి కూడా వినియోగంలోకి రాలేదన్నారు. లేపాక్షి, వాన్ పిక్, తుండూరు ఆక్వా ఫుర్ పార్కుల నిర్మాణం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని పేర్కొన్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కమ్యూనిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు అనడం సరికాదన్నారు. కమ్యూనిస్టులు పరిశ్రమలకు వ్యతిరేకమని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.