September

నాలుగు వారాల్లో తేల్చండి:సుప్రీం

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు పిటిషన్‌ను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఏపి సిఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషన్‌ల తో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

భూ నిర్వాసితులకు అండగా..

జిల్లాలో సోలార్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కోవడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్లాంట్‌ నిర్మాణం జరగబోయే గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట భూముల్లో ప్లాంట్‌లు నిర్మించి, ఎవరిని ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభత్వంపైనే ఉందని చెప్పారు. 

Pages

Subscribe to RSS - September