September

వంశధార నిర్వాసితులకు పరిహరం చెల్లించాలి :CPM

వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సిపిఎం పోరాడుతోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పోలీసు బందోబస్తు మధ్య రిజర్వాయర్‌ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తోంది.  నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహరం చెల్లించి పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకోవడానికి వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి మరియు నాయకులను హీరమండలం బ్యారేజి సెంటర్లో పోలీసులు అరెస్టు చేశారు 

'పెట్టుబడి' గ్రంధాన్ని చదవాలి

పెట్టుబడి దారి వ్యవస్థలో పాలకులు అవలంభిస్తున్న వైఖరి వల్ల దేశంలో దోపిడీ, ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ పేర్కొన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'పెట్టుబడి గ్రంథం ప్రాముఖ్యత' అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు జరిగింది. శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శర్మ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారి వ్వవస్థ నుంచి మార్పును, విప్లవాన్ని కోరుకునే వారు తప్పని సరిగా కారల్‌ మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంధం చదవాలని కోరారు.

వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన కోసం ప్రజా సమీకరణ

మానవ చరిత్రను మార్చిన అక్టోబరు మహా విప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో పాలకులు.. పెట్టుబడిదార్ల గుప్పిట్లో చిక్కుకున్న క్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి వారితో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను రూపొందించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'అక్టోబర్‌ మహా విప్లవ శతవార్షికోత్సవ సభ'కు ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఏచూరి మాట్లాడుతూ..

గౌరీ లంకేష్‌ హత్యకు వ్యతిరేకంగా నిరసన

పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్‌, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు. 

పెద సుబ్బారావుకు ఘన నివాళులు

అనారోగ్యంతో గురువారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ సభ్యులు పోపూరి సుబ్బారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం యడ్లపాడులోని సొంత వ్యవసాయ పొలంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. పార్టీలో నాలుగు దశాబ్ధాలపాటు క్రీయాశీలకంగా పనిచేసినా పోపూరి సుబ్బారావు మృతి వార్త తెలిసిన వెంటనే చిలకలూరిపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి సిపిఎం కార్యకర్తలు ఆయన మృత దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు పోపూరి రామారావు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త సుబ్బారావు అని నివాళి అర్పించారు.

11న సీతారాం ఏచూరి గుంటూరు రాక

చరిత్ర గతిని మార్చిన సోవియట్‌ అక్టోబర్‌ మహా విప్లవం శత వార్షికోత్సవాలు, పెట్టుబడి గ్రంధం 150 ఏళ్ల ఉత్సవాలు, కారల్‌ మార్క్సు ద్విశత జయంతి సందర్భంగా ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సదస్సులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యత, సమకాలీనత అనే అంశంపై ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు.

Pages

Subscribe to RSS - September