September

వరద బాధితులకు సహాయం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

చిరువ్యాపారులు జీఎస్టీకి వెలుపలే..

దేశవ్యాప్తంగా ఏకరీతి పన్నుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలుకు సంబంధించి మరో కీలకమైన ముందడుగు పడింది. వార్షిక టర్నోవర్‌ రూ.20లక్షల లోపు ఉండే చిరు వ్యాపారులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కి వెలుపలే ఉంచే విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యాపార పరిధిని అనుసరించి ఆయా డీలర్లు/వ్యాపారులపై అజమాయిషీ ఎవరిది ఉండాలనే అంశంలోనూ చాలా వరకు స్పష్టత వచ్చింది.

ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలి

మన ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రాసిన ‘సిటిజన్‌ అండ్‌ సొసైటీ’ పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. అనేక సమస్యలున్నా సమాజానికి దారి చూపగల శక్తి దేశానికి ఉందని మోదీ అన్నారు. అన్సారీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. 

వెస్టింగ్‌హౌస్‌ రియాక్టర్ల కోసం రుణం..

వెస్టింగ్‌హౌస్‌ అణు రియాక్టర్లు ఆరింటిని కొనుగోలు చేసేందుకు అమెరికా ఎగుమతి-దిగుమతుల బ్యాంక్‌ నుండి 8-9 బిలియన్ల డాలర్ల రుణాన్ని భారత్‌ కోరుతోంది. ఇందుకు సంబంధించి అమెరికాతో అది చర్చలు జరుపుతోంది. ఇటీవలి కాలంలో అమెరికా-భారత్‌ సంబంధాలు బలపడుతున్న ఫలితంగా ఈ మెగా ప్రాజెక్టు వచ్చింది.

రాఫెల్‌పై భారత్ ఫ్రాన్స్ ఒప్పందం..

ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు దాదాపు రూ.58వేల కోట్ల(7.87 బిలియన్‌ యూరోలు)కు కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌లు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం మనదేశ అమ్ములపొదిలో లేని ‘మెటియోర్‌’, ‘స్కాల్ప్‌’ వంటి క్షిపణులు రాఫెల్‌ యుద్ధవిమానాలతో కలిసి భారత వైమానిక దళానికి అందనున్నాయి.

కాశ్మీరీ యువతపై వేధింపులు ఆపాలి:తరిగామి

కాశ్మీరీ యువతపై ప్రజా భద్రత చట్టం (పిఎస్‌ఎ) ప్రయోగించి వేధింపులకు గురిచేయడం విరమించాలని సిపిఐ(ఎం) నేత, ఎంఎల్‌ఏ మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి అన్నారు. ఈ నిరంకుశ చట్టంతో యువతను భయాందోళనలకు లోనుచేయవద్దని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పలు సందర్భాల్లో ఎలాంటి కారణాలు లేకుండానే యువతపై ఈ చట్టం ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులతో ప్రభుత్వంపై యువతకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జాషువా సాంస్కృతిక వేదిక..

విజయ వాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 'జాషువా సాం స్కృతిక వేదిక' ఆవిర్భావ సభకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సి శర్మ అధ్యక్షత వ హించి ప్రసంగించారు. సాంస్కృతిక వికాసం కోసం ఈ వేదిక కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తికి కొలమానాలు పెడుతున్నారని, కవులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వరద బాధితులను ఆదుకోవాలి:మధు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పూర్తిగా జన జీవనం స్తంభించిందని, రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయని తెలిపారు. నిత్యావసర వస్తువులూ నీట మునిగాయని పేర్కొన్నారు. వెంటనే పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవాలని, ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జాబ్యాలెట్..

ఎ.పి కి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అమ‌లాపురంలోని గ‌డియార స్ధంబం సెంట‌ర్‌లో వామ‌ప‌క్షాల ఆధ్వర్యంలో  ప్ర‌జాబ్యాలెట్ ఏర్పాటు చేశారు.. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిర్ణయాన్ని తెలపాలని విజ్ఞప్తి చేశారు .

Pages

Subscribe to RSS - September