September

ఎ.పికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ నిర‌స‌న‌లు

ఎ.పికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ నిర‌స‌న‌లు...అ్ర‌క‌మ అరెస్టులు
ఆంద్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ రాష్ట్రంలో నిర‌స‌న‌లతో హోరెత్తుతుంది. తిరుప‌తిలో సిపియం, సిపిఐ, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌ ద‌గ్గ‌ర ధ‌ర్న, 64 మంది అరెస్టు.

బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి:మధు

ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని..నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి బంద్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

విలువలతో కూడిన విద్య నేటి అవసరం

స్వాతంత్య్రోద్యమంలో మహా నాయకులు తమ పుట్టినరోజులను సామాజిక ఆశయాలతో ముడిపెట్టుకున్నారు. పుట్టిన రోజును కొత్త తీర్మానాలు చేసుకొనేదిగా నిర్ణయించుకున్నారు. కొత్త ఆశయాలకు కంకణబద్ధులై అందుకు ప్రణాళిక రచించుకొనే రోజుగా మార్చుకొని రాజీలేని పోరాటం చేశారు. కాబట్టే సెప్టెంబర్‌ 5న భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని యావత్‌ భారతావని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటోంది. 'విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఉపాధ్యాయుల దిశానిర్దేశం లేకపోతే విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరమే అనేందుకు మరో మాటలేదు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే..

దివీస్ ఫార్మాకు వ్యతిరేకంగా పోరు

ఈస్ట్ గోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజీపేటలో దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు

గోవా ఆర్‌ఎస్‌ఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోవా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ సుభాష్‌ వోలింగ్‌కర్‌ను తొలగించడంతో సంక్షోభం ముదిరింది. సుభాష్‌కు మద్దతుగా 4 వందల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజీనామాలు చేశారు. తనను పదవి నుంచి తప్పించడం వెనక కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ హస్తముందని సుభాష్‌ వోలింగర్‌ ఆరోపిస్తున్నారు. 

ఈ రెండేళ్లు సరిపోలేదా..? : రామకృష్ణ

విభజన హామీలు నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోలేదా అని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.లోటు బడ్జెట్ కూడా పూడ్చని కేంద్రం.... ప్రత్యేక హోదాకి సమానంగా నిధులు ఇస్తామంటే ఎలా నమ్మాలని అన్నారు. 

ఓటుకు నోటు కేసులో సుప్రీంకు వెళ్తాం

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటీషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టంగా తీర్పులిచ్చానా వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్టే విధించిందని పిటీషనర్‌ తరపు లాయర్ అన్నారు. సమగ్ర వివారలతో కూడిన కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.

Pages

Subscribe to RSS - September