September

నష్టపరిహారం ఏది..?:గంగారావు

గంగవరం పోర్టు యాజమాన్య నిరంకుశత్వానికి సోమవారం ఓ కార్మికుడు మృతి చెందాడు. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి రాజారావు(40) పోర్టులో అగ్రికల్చర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. పోర్టుకు కిలోమీటరు దూరంలో రాజారావుకు సంబంధం లేని గోతులు తవ్వే పనిని యాజమాన్యం అప్పగించింది. పని ప్రదేశంలో మంచినీరు కూడా లేదు. పనిచేస్తుండగా రాజారావు కుప్పకూలిపోయాడు. అప్పటికే మృతిచెందిన రాజారావును చికిత్స పేరుతో దొడ్డిదారిన మల్కాపురంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కెజిహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు.

రైతులకు అండగా..:కృష్ణమూర్తి

భోగాపురంలోని ఎయిర్‌ పోర్టు బాధిత రైతులను, ప్రజలను మోసగించే ధోరణిని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా మండలం లోని కౌలువాడలో రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ పరిశ్రమల పేరుతో తీసుకున్న భూముల్లో ఎక్కడా పరిశ్రమలను స్థాపించలేదన్నారు. బాధితుల ఆందోళనను, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, ఆగస్టు 31న అర్ధరాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

హోదాపై జీపుజాతా:రాంభూపాల్‌

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జీపుజాతాను ప్రారంభించారు. తొలిరోజు రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో జాపుజాతా పర్యటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎనిమిదేళ్లుగా తీవ్ర కరువు నెలకొందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట దీక్ష

రాజధాని శంకుస్థాపన కోసం రూ. 50 కోట్లు ఖర్చుచేస్తున్న ముఖ్యమంత్రికి అసైన్డ్‌, సీలింగ్‌ భూముల సాగుదారుల ఆకలికేకలు వినిపించడం లేదా అని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రశ్నించారు. బాధితులకు కౌలుచెక్కుల చెల్లింపుపై ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో అసైన్డ్‌, సీలింగ్‌ సాగుదారుల దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. రాజధాని ప్రాంత పేదల సమస్యలు పరిష్కరించకుండా తీవ్రమైన అణచివేతకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్‌ నుండి ఇవ్వాల్సిన పెన్షన్‌ ఇవ్వకుండా విచారణ పేరుతో లబ్ధిదారులను కుదించడం అన్యాయమన్నారు.

సాయినార్‌ ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకోవాలి. మృతిచెందిన ఒక్కొక్కరికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు (28-9-2015)న మధ్యాహ్నాం పరవాడ జవహర్‌లాల్‌ ఫార్మాసిటీలో సాయినార్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందగా, మరో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్‌ చేస్తున్నది. గాయపడిన క్షతగాత్రులను విశాఖలోని న్యూ కేర్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్, అధ్యక్షులు జి.కోటేశ్వరరావు.

మత సమరస్యంనికి భంగం కలిగిస్తున బి జె పి వైకరిని ఖండిచండి సి పి యం , సి పి ఐ సమావేశం

మత సమరస్యంనికి  భంగం కలిగించే రీతి లో  బి జె పి మరియు అనుబంధ  సంస్తలు  స్సగిస్తున అప్రజాస్వామిక  ధోరణలు జిల్లా ప్రజలు నిరిసించాలని సి పి యం , సి పి ఐ నాయకులూ  కోరుతు   బి జె పి వైకరిని సి పి యం , సి పి ఐ లు  ఖండిచాయ్.  బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లిమ్స్   వారి వస్త్ర దారణ , ఆహారపు అలవాట్లు , సంస్కృతి విషయం లో జోక్యం చేసుకోవడం , వారిని రెచ్చ గోటడం లాటివి మత సామరస్యంనికి బంగం కలిగిస్తుదని  కావున  ఇలాంటి చర్యలు జరగా కుండ చూడాలని వారు ప్రభుత్వాని డిమాండ్ చేసారు.  

స్వాతంత్య్ర సంగ్రామంలో గిరిజనోద్యమాలు..

ఆదివాసీలు అనాదిగా సభ్యసమాజ సంస్కృతికి, నవనాగరికతకు నాంది. కానీ నేడు ఈ పాశ్చాత్య పోకడల ప్రపంచములో అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎన్నో పంచవర్షప్రణాళికలు వచ్చినా ఇప్పటి వరకు దేశంలో అనేక ప్రాంతాల ఆదివాసీల అభివృద్ధి అగమ్యగోచరంగానే ఉండిపోయింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 వసంతాలు నిండుతున్నప్పటికీ అభివృద్ధి ఫలాలు అందనంత దూరంలో ఆదివాసీ పల్లె ప్రజలున్నారనడంలో సందేహం లేదు.

విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందా?

విమానాశ్రయాలు నిర్మిస్తేనే దేశం, రాష్ట్రం వేగంగా అభివృది ్ధచెందుతుందని కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు నోట తరచూ వినిపిస్తున్నది. ఇది వాస్త వమా..? ఇదే నిజమైతే ఇప్పటికే మన దేశంలో 448 విమానాశ్రయాలున్నాయి. దేశం ఎంత అభివృద్ధి చెంది ఉండాలి? ప్రజల జీవన ప్రమాణం ఎంత మెరుగుపడి ఉండాలి? అసలు విమానాశ్రయాలు నిర్మిస్తే దేశం అభివృద్ధి చెందినట్లా..? లేక విమానాల్లో ప్రయాణించ గలిగే ఆర్థిక స్తోమత ప్రజలకు కలిగిస్తే దేశం అభివృద్ధిచెందినట్లా..? అన్నది పాలకులు ఆలోచించాలి. ఇటీవల కేంద్ర పౌర విమాన యాన శాఖ వెలువరించిన నివేదికను పరిశీలి స్తే..

కార్పొరేట్‌ అనుకూల విధానాల్లో టిడిపి ప్రభుత్వ ముందంజ

కార్పొరేట్‌ కంపెనీలు సులు వుగా వ్యాపారం చేసుకునే అవకా శాలు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఈ అవకాశాలు కల్పించడానికి అవసర మైన సంస్కరణలు అమలు చేస్తున్న క్రమంలో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయో జనాలు సమిధలవుతున్నాయి. కార్పొరేట్‌ అనుకూల సంస్కరణల అమలులో బిజెపి, తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణల అమలు బాగా స్పీడందుకుంది. ప్రపంచ బ్యాంకుతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకున్న బంధం దీనికి తోడయింది.

భగత్‌సింగ్‌ త్యాగం వృథా కానీయరాదు..

విప్లవానికి మారు పేరు భగత్‌సింగ్‌. పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్య్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి. నేటి యువతకు ఆదర్శప్రాయుడే కాకుండా రోల్‌ మోడల్‌. ఇటువంటి విప్లవనేత జయంతిని పురస్కరించుకుని పాలకుల వినాశకర విధానాలపై గళం విప్పేందుకు యువత నడుంబిగించాలి. సువిశాల భారతదేశంలో 1907 సెప్టెంబర్‌ 27న పంజాబ్‌ రాష్ట్రం రాయల్‌పూర్‌ జిల్లా బంగా ప్రాంతంలో భగత్‌సింగ్‌ జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈ యువకిశోరం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో స్వాతంత్య్ర పోరాటానికే వన్నెతెచ్చారు. దేశాన్ని ఉత్తేజింపజేశారు.

Pages

Subscribe to RSS - September