September

ప్ర‌త్యేక హూదాలో అరెస్టుల ప‌ర్వం

చిత్తూరు జిల్లాలో ప్ర‌త్యేక హూదా కోసం జ‌రిగిన బంద్‌లో 144 సెక్ష‌న్  క్రింద సిపియం పార్టీ,  ప్ర‌జాసంఘాల నాయ‌కుల‌ను అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఢిల్లీలో వెంకయ్య..బెజవాడలో బాబు

ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మూడు నామాలు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హోదాపై ఢిల్లీలో వెంకయ్య నాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామా చేశారన్నారు. కేంద్రం నుండి టీడీపీ బయటకు రావాలని నారాయణ డిమాండ్ చేశారు

ఒబామాతో ప్రధాని మోదీ భేటీ

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు.. లావోస్‌ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

అసెంబ్లీలో ‘ప్రత్యేక హోదా’ వేడి

ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తర్వాత సభలోకి వచ్చిన వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైకాపా ఆందోళనపై స్పందించిన ఆర్థికమంత్రి యనమల ప్రత్యేక హోదా అశంపై సీఎం ప్రకటన చేస్తారని.. ఆ తర్వాత జరిగే చర్చలో పాల్గొనాలని స్పష్టం చేశారు.

ప్యాకేజీపై ప్రభుత్వం తర్జనభర్జనలు..

ఏపీ ప్రత్యేక హోదా..ప్యాకేజీపై బుధవారం అర్ధరాత్రి కేంద్రం చేసిన ప్రకటనపై ఏ స్టేట్ మెంట్ చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రకటనపై ఎలా స్పందించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

కేంద్రం వైఖరికి నిరసనగా..

ప్రత్యేక హోదాపై చేతులేత్తిసిన కేంద్రంపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. తొలి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి.రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి.

Pages

Subscribe to RSS - September