September

‘లాజిస్టిక్‌ హబ్‌’ భూ సాగుదార్లకు నష్టపరిహారం పెంచాలి. కూలీలకు, వృత్తిదార్లకు ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి.- సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

    ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రయత్నాలు సాగుదార్లను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్‌ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, వల్లూరు, ఎరుకువానిపాలెం, రాజుపాలెం, గొర్లివానిపాలెం) 8 గ్రామాల్లో సుమారు 486 ఎకరాల భూమును సేకరిస్తున్నారు. 

పింఛన్లు ఇవ్వాలని CRDA వద్ద ధర్నా

రాజధాని ప్రాంతలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం సిఆర్‌డిఎ కన్వీనర్‌ సిహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ పేదలకు పింఛన్లే ఇవ్వలేనివారు రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి రూ.10కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం పేదలకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. తన సొంత ఇల్లు చూసుకున్న సిఎం పేదల ఇళ్ల గురించి మర్చిపోవడం దారుణమన్నారు.

సనాతన్‌ సంస్థపై నిషేధం..

సామాజిక ఉద్యమకారులు, హేతు వాదులు, రచయితలపై దాడులకు పాల్పడుతున్న హిందూ అతివాద సనాతన్‌ సంస్థపై నిషేధం విధిం చాలని పలు రాజకీయ డిమాండ్‌ చేశాయి. సిపిఐ నేత,రచయిత గోవింద్‌ పన్సారే హత్య కేసులో నిందితుడైన సమీర్‌ గైక్వాడ్‌తోపాటు సనాతన్‌ సంస్థకు చెందిన మరికొందరు ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఐతే,నిందితులకు ఆ సంస్థతో సంబంధాలు న్నట్టు రుజువులు సాధించకుండా నిషేధం విధించాలని కేంద్రానికి ప్రతిపాదన పంపలేమని మహారాష్ట్ర హోంశాఖ అధికారులు తెలిపారు.

అన్నిశాఖలపై ప్రపంచబ్యాంకు పెత్తనానికి యత్నం..

 ప్రపంచ బ్యాంకు ఈ నెల 14న 'అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫామ్స్‌' అనే నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1-జూన్‌ 30 మధ్య పారిశ్రామిక, వ్యాపార సంస్కరణలకు సంబం ధించి 98 అంశాలను మదింపు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ కీలక పాత్ర పోషించి రూపొం దించిన ఈ నివేదిక రూపకల్పనలో మేక్‌ ఇన్‌ ఇండియా, కెపియంజి, సిఐఐ, ఫిక్కీ ఉన్నాయి. ఇందుకు 285 ప్రశ్నలను రూపొందించి, వాటికి ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాధా నాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి ర్యాంకులు నిర్ణయిం చినట్లు నివేదికలో పేర్కొంది. ఈ ప్రశ్నలలో కార్మిక చట్టాల నియంత్రణకు సంబంధించినవి 51 కాగా, మరో 61 తనిఖీలకు సంబంధించినవి.

వాట్సప్‌పై కేంద్రం వెనకడుగు..

 జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానంపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఎన్‌క్రిప్షన్‌ ముసాయిదా స్థానంలో సవరించిన సంకేత/సంక్షిప్త(ఎన్‌క్రిప్షన్‌) ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించినది కేవలం ముసాయిదా మాత్రమేనని.... ప్రజల నుంచి అందిన సూచనల మేరకు మార్పులు చేసి త్వరలో తాజా విధానాన్ని అందుబాటులోకి తీసువస్తామని ఆయన చెప్పారు. సాధారణ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధానముంటుందని పేర్కొన్నారు.

ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల భారం

చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
-  ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
-  పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
-  విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
-  నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం

దోషులను బోనులో నిలబెడతాం

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">                'విశాఖ జిల్లా సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావించడం నేరమా? చదువుకునే వాతావరణం కలుగజేసేందుకు సమస్యలను పరిష్కారం చేయమని అడిగితే అణచివేయడమే సమాధానమా? ఉద్యమాల సందర్భంగా లాఠీఛార్జి వంటివి జరిగితే తప్పుచేశామని ఒప్పుకునే అలవాటు పోలీస్‌ ఉన్నతాధికారుల్లో కనిపించేది..

Pages

Subscribe to RSS - September