September

మోడీ అన్నింటా విఫలం:బృందా

కేంద్రంలోని మోడీ సర్కార్‌ ప్రజాసంక్షేమం సహా అన్నింటా వైఫల్యం చెందిందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపి బృందాకరత్‌ అన్నారు. ఏడాది పాలనలో ప్రజలపై ఆర్ధికభారాలు మోపడం మినహా సాధించింది ఏమీ లేదని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందన్నారు.గురువారం  హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం దేశంలోని మూడు రాష్ట్రాలు మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఆహారభద్రతా బిల్లు ప్రకారం నిత్యవసరవస్తువుల్ని సరఫరా చేయట్లేదని తెలిపారు. 

మొక్కుబడి సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు మాటల యుద్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది మినహా ప్రజోపయోగ చర్చలు, తదుపరి కార్యాచరణకు ఎలాంటి స్థానం లేకపోవడం దారుణం. విపక్షానికి అవకాశమివ్వడం, విపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానాలివ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేయడం ప్రజాస్వామ్యంలో అధికారపక్ష కనీస బాధ్యత. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా స్ఫూర్తిని మరచిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

సాగుదారులకు అండగావుంటాం: మధు

 బందరు పోర్టు భూముల ప్రభావిత గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విస్తృతంగా పర్యటించారు.భూ బ్యాంక్‌ పేరుతో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బందరు తీరంలో 30 వేల ఎకరాలు సమీకరిస్తోందని, ఇందులో 14 వేల ఎకరాల ప్రైవేటు భూములున్నట్లు చెబుతూ మిగిలిన 16 వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్న రైతులకు మొండిచెయ్యి చూపించేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. సాగుదారులకు అండగా ఉంటామని, పోరాటం చేసి ప్రభుత్వ తీరును ఎండగడతామని బాధితులకు భరోసా ఇచ్చారు.

ప్రభుత్వతీరు సిగ్గుచేటు:మధు

విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా సిపిఎం నాయకులను, రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తోటపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు కింద కాల్వలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించాలని ప్రాజెక్టు నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు కూడా నిర్ణయించాయని తెలిపారు.

మోడీ అచ్చేదిన్ భ్రమే: ఏచూరి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మంచి రోజులు ఒట్టి భ్రమేనని, అచ్చేదిన్‌ సూచనలే కానరావడం లేదని సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారం ఏచూరీ విమర్శించారు. మతోన్మాద బిజెపితో పాటు కార్పొరేట్‌ సేవలో తరిస్తున్న జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌లను ఎన్నికల్లో ఓడించాలని కోరారు. మోడీ అశ్వమేధ యాగ గుర్రాన్ని కట్టి వేయగల సత్తా బీహార్‌ ప్రజలకుందని ఏచూరి చెప్పారు. రామాయణం చివరిభాగంలో రాముడి అశ్వమేధ గుర్రాన్ని లవకుశులు నిలువరించారని, అదే విధంగా మోడీ అశ్వమేధ గుర్రాన్ని రైతులు, కార్మికులు నిలువరిస్తారని తెలిపారు.

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించాయని, తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి వ్యాధులను అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిపిఎం ప్రజారోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ సభ్యులు టి.కామేశ్వరరావు, బిఎల్‌ నారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఒక్క విశాఖలోనే 7210 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.

భూబ్యాంక్‌ ఎవరికోసం? :CPM

ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములు సహా మొత్తం 15 లక్షల ఎకరాలతో రాష్ట్రంలో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచలేదన్నారు. ఈ విధానాలు సామాన్య ప్రజల సంక్షేమానికి చేటు తెస్తాయని, తమ పార్టీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. 

Pages

Subscribe to RSS - September