రాజధానిలో 144 సెక్షన్ విధించటం పౌరుల హక్కులను ఉల్లంగించటమె.

సిపియం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్భంధం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో సిపియం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని అని చెబుతున్న ప్రభుత్వం శంఖుస్థాపన జరగక ముందే అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తుందన్నారు. ఇది రాజధాని సమస్య కాదని పౌర హక్కుల సమస్యని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి 1.10 లక్షల ఎకరాల భూమిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందనీ, కానీ మాస్టర్ ప్లాన్ లో మాత్రం అన్ని కార్యాలయాలకు కలిపి 155 ఎకరాలు సరిపోతుందని చూపిస్తున్నారని, మిగిలిన భుమూల్ని కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ కూలిలకు ఉపాధి, పింఛన్లు ఇంత వరుకు ఇవ్వలేదని, రైతులకు భూమి ఎక్కడిస్తారో స్పష్టంగా చేప్పలేదు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫి కూడ చేయలేదన్నారు. ప్రజలు పనుల్లేక ఇతర గ్రామాలకు వలసలు వెళుతున్నారు. ప్రజలకు ఇళ్ళునిర్మిస్థామని చెప్పి ఉండవల్లిలో రోడ్డునిర్మాణం కోసం ఇళ్ళు తోలిగిస్తున్నారని, సిఎం నివాసం ఎర్పాటు చేసిన చోట మత్స్య కారులకు చేపల వేట నిషేధించారు. దీంతో వారు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. రాజధానిలో అమలౌతున్న అప్రకటిత ఎమర్జెన్సీని అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు.