September

రాష్ట్ర కమిటీ సమావేశాలు..

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవాడలో నిర్వహించారు.విద్య, వైద్యాన్ని రైతుల భూములనూ కార్పొరేట్‌ రంగానికి ధారాదత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేట్‌ పరిపాలన ప్రవేశపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. ఉన్నత విద్య బాధ్యత తమది కాదనీ, దాన్ని కార్పొరేట్‌ రంగం సామాజిక బాధ్యతగా భóుజస్కం ధాలపై వేసుకోవాలని ఉపాధ్యాయ దినోత్సవం నాడు స్వయానా ముఖ్యమంత్రే చెప్పారని మధు గుర్తు చేశారు.

కోటవురట్ల మండలం గొట్టివాడ ఇసుక ర్యాంపుని వెంటనే ఆపాలి.

 

కోటవురట్ల మండలం గొట్టివాడ ఇసుక ర్యాంపుని వెంటనే ఆపాలని ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాచేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. 

LICని కాపాడుకుందాం:CITU

ఎల్‌ఐసి, ఏజెంట్ల రక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో గురువారం ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన 4వ ఆలిండియా కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఐసినీ, ఏజెంట్ల వ్యవస్థనూ నిర్వీర్యం చేయడం జాతి వ్యతిరేక చర్య అని, ఈ అంశంలో కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.స్టాక్‌ మార్కెట్‌లలో పింఛన్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్మును పెట్టడాన్ని అందరూ వ్యతిరేకిం చాలన్నారు.

సామాజిక న్యాయమా? ఆధిపత్యమా?

మరోసారి రిజర్వేషన్లపై రగడ మొదలైంది. గుజరాత్‌ పటేళ్ల ఆందోళన దీన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఇది చాలా ఆందోళన కరమైన పరిణామం. తమను వెనకబడిన తరగతుల్లో చేర్చి రిజర్వేషన్లు వర్తింపజేయాలని వారు చేపట్టిన ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది. ప్రధాని సొంత రాష్ట్రం అభివృద్ధికి ఆధునిక నమూనాగా చెప్పబడుతున్న గుజరాత్‌లో ఈ పరిణామం జరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనంటూ మీడియా ఊహాగానాలు మొదలు పెట్టింది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీ దీనివల్ల లాభపడుతోంది? అంతిమంగా ఇది రిజర్వేషన్లను ఎత్తివేసే వైపు సాగుతుందా? పటేళ్లు నిజంగానే వెనకబడిన వారా?

కార్మికసంఘాలకు దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది.

కార్పొరేట్ల సేవలొ కేంద్ర రాష్త్ర ప్రభుత్వలు:- వి.కృష్ణయ్య

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు.

Pages

Subscribe to RSS - September