జిఒ 329ను రద్దు చేయాలి

శ్రీకాకుళం జిల్లా సోంపేట చిత్తడి నేలల్లో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 329ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. చిత్తడి నేలల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించడం చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చిత్తడి నేలల సంరక్షణ చట్టంలోని 4 (1) (ఱఱ) ప్రకారం బోట్‌ జెట్టీ తప్ప, ఇతర ఏ కట్టడమూ నిర్మించరాదని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.