200 ఎకరాలు స్వాహా..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. గుంటూ రు జిల్లాలోని రాజధాని ఏరియాలో సర్కారు ప్రతిపాదించిన భూసమీకరణ కిందకురాని రైతుల భూములను సేకరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తొలిదశలో ఆరు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2013- భూసేకరణ చట్టానికి సవరణలు చేయరాదని, తదుపరి ఆర్డినెన్స్‌లు ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించడంతో ఎపి రాజధానిలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. రాజధాని ప్రాంతంలో వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపు లభించే దేవాలయాల కింద భూములున్నాయి. వాటిని రైతులు వంశపారంపర్యంగా కౌలు చేసుకుంటున్నారు. ఆ భూములను కూడా రాజధానికి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు స్వాధీనపర్చుకుంటామని రైతులకు నోటీసులు సైతం ఇచ్చింది. అనంతవరం తదితర గ్రామాల్లో ఇటువంటి భూములు సుమారు రెండు వందల ఎకరాలున్నాయి. వాటిని సేకరించేందుకు సర్కారు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు తెలిసింది. ఈ భూములపై అధికారపార్టీకి చెందిన కొందరు నేతల కన్నుపడింది. ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్‌ రూపొందించారు. భూసేకరణ వలన మీకేమీ లాభం ఉండదని రైతులను బెదిరిస్తున్నారు. 'భూసేకరణ నోటిఫికేషన్‌ నుంచి మీరు కౌలు చేసుకుంటున్న భూములను తప్పిస్తాం, వాటికి ఎలాగొలా మీ పేరు మీద పట్టాలిప్పించి హక్కులు కల్పిస్తాం, వాటిని మాకు అమ్మండి. ఓకే అంటే భూ ములను చెరి సగం పంచుకుందాం' అని రైతులను ఆకర్షిస్తున్నారు. 'ఫిఫ్టీ ఫిఫ్టీ' ఆఫర్‌పై రైతుల్లో కలకలం బయలుదేరింది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, కనీసం తమకే కౌలుకు ఇవ్వాలని పేద రైతులు మొత్తుకుంటున్నారు. భూసేకరణలో భూములు కోల్పోతే తమ గతేంటని ఆందోళన చెందుతున్నారు. పేదలు చేసుకుంటున్న భూములను భూసేకరణ నుంచి మినహాయిం చాల్సింది పోయి టిడిపి నాయకులు కైవసం చేసుకోడానికి స్కెచ్‌ వేశారు. పార్టీ యువ నేత ఆదేశాలతో గ్రామాల్లో తిరుగుతున్న బృందాలు కౌలు రైతులతో బేరసారాలు మొదలుపెట్టాయి. 'చెరి సగం' ఫార్ములాపై రాతపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తమ ఆఫర్‌కు లొంగని వారిని నయానో భయానో లోబర్చుకునే ప్రయత్నాలు ముమ్మ రం చేశాయి. అనంతవరం, చుట్టుపక్కల దేవాలయ భూము లుఎకరం తక్కువలో తక్కువ రూ.2 కోట్లు పలుకుతున్నాయి. యువ నేత టీంల 'ఫిఫ్టీ ఫిఫ్టీ' ఆఫర్‌ అమలైతే వంద ఎకరాలు అధికారపార్టీ నాయకుల కైవసమవుతుంది. ఎకరం రూ. 2 కోట్ల చొప్పున లెక్కేసుకున్నా అప్పనంగా లభించిన వంద ఎకరాల విలువ రూ. రెండొందల కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. గుంటూ రు జిల్లాలోని రాజధాని ఏరియాలో సర్కారు ప్రతిపాదించిన భూసమీకరణ కిందకురాని రైతుల భూములను సేకరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తొలిదశలో ఆరు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2013- భూసేకరణ చట్టానికి సవరణలు చేయరాదని, తదుపరి ఆర్డినెన్స్‌లు ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించడంతో ఎపి రాజధానిలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. రాజధాని ప్రాంతంలో వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపు లభించే దేవాలయాల కింద భూములున్నాయి. వాటిని రైతులు వంశపారంపర్యంగా కౌలు చేసుకుంటున్నారు. ఆ భూములను కూడా రాజధానికి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు స్వాధీనపర్చుకుంటామని రైతులకు నోటీసులు సైతం ఇచ్చింది. అనంతవరం తదితర గ్రామాల్లో ఇటువంటి భూములు సుమారు రెండు వందల ఎకరాలున్నాయి. వాటిని సేకరించేందుకు సర్కారు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు తెలిసింది. ఈ భూములపై అధికారపార్టీకి చెందిన కొందరు నేతల కన్నుపడింది. ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్‌ రూపొందించారు. భూసేకరణ వలన మీకేమీ లాభం ఉండదని రైతులను బెదిరిస్తున్నారు. 'భూసేకరణ నోటిఫికేషన్‌ నుంచి మీరు కౌలు చేసుకుంటున్న భూములను తప్పిస్తాం, వాటికి ఎలాగొలా మీ పేరు మీద పట్టాలిప్పించి హక్కులు కల్పిస్తాం, వాటిని మాకు అమ్మండి. ఓకే అంటే భూ ములను చెరి సగం పంచుకుందాం' అని రైతులను ఆకర్షిస్తున్నారు. 'ఫిఫ్టీ ఫిఫ్టీ' ఆఫర్‌పై రైతుల్లో కలకలం బయలుదేరింది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, కనీసం తమకే కౌలుకు ఇవ్వాలని పేద రైతులు మొత్తుకుంటున్నారు. భూసేకరణలో భూములు కోల్పోతే తమ గతేంటని ఆందోళన చెందుతున్నారు. పేదలు చేసుకుంటున్న భూములను భూసేకరణ నుంచి మినహాయిం చాల్సింది పోయి టిడిపి నాయకులు కైవసం చేసుకోడానికి స్కెచ్‌ వేశారు. పార్టీ యువ నేత ఆదేశాలతో గ్రామాల్లో తిరుగుతున్న బృందాలు కౌలు రైతులతో బేరసారాలు మొదలుపెట్టాయి. 'చెరి సగం' ఫార్ములాపై రాతపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తమ ఆఫర్‌కు లొంగని వారిని నయానో భయానో లోబర్చుకునే ప్రయత్నాలు ముమ్మ రం చేశాయి. అనంతవరం, చుట్టుపక్కల దేవాలయ భూము లుఎకరం తక్కువలో తక్కువ రూ.2 కోట్లు పలుకుతున్నాయి. యువ నేత టీంల 'ఫిఫ్టీ ఫిఫ్టీ' ఆఫర్‌ అమలైతే వంద ఎకరాలు అధికారపార్టీ నాయకుల కైవసమవుతుంది. ఎకరం రూ. 2 కోట్ల చొప్పున లెక్కేసుకున్నా అప్పనంగా లభించిన వంద ఎకరాల విలువ రూ. రెండొందల కోట్లు అవుతుంది.