September

విశాల ఉద్యమం చేపట్టాలి: YV

కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా తరగతుల ప్రజలు విశాల ఉద్యమం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. పార్టీ ఒంగోలు జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవన్‌లో జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల అనుకూల విధానాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతం కంటే మరింతగా కార్పొ రేట్ల ప్రయోజనాలు కోసం పని చేస్తోందని విమర్శించారు.

సిపిఎం ఉచిత మెడికల్‌ క్యాంపు..

 తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక, ఎపిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. మన్యంలో మలేరియా కేసులు లేవని ప్రభుత్వం చెబుతోంది. వైద్య శిబిరంలో బ్రెయిన్‌ మలేరియా కేసులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చింతూరులో ఈనెల 23న ప్రారంభమైన వైద్య శిబిరం అక్టోబర్‌ 22 వరకు కొనసాగనుంది. బుధవారం 43 గ్రామాల నుంచి రోగులు తరలివచ్చారు. 109 మందికి పరీక్షించగా, 22 మంది జ్వరపీడితులు ఉన్నారు. వీరిలో ఆరు బ్రెయిన్‌ మలేరియా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  మిడియం బాబూరావు చెప్పారు.

సిఎం మాట నిలబెట్టుకోవాలి..

 ఇళ్ల స్థలాలు, పట్టాలు, సాగు భూముల కోసం పేదలు కదం తొక్కారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రైతు సంఘం సంయుక్తంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం చేపట్టిన ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది పేదలు తరలొచ్చారు.నీరు-చెట్టులో భాగంగా పేదలు ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువులు తవ్వి తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాసిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడారు. ఇళ్లస్థలాలు ఇస్తామని ఎన్నికలప్పుడు హామీనిచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

CRDA చట్ట సవరింపు..

ఏపీ సర్కార్ సీఆర్డీఏ చట్టాన్ని తాజాగా మళ్లీ సవరించింది. దీంతో ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి...ఇప్పుడు 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే అదనంగా 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది.కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం పూర్తిగా సీఆర్డీఏ లో కలిసింది. దీంతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను ఇందులో కలిపారు. గుంటూరు జిల్లాలోనూ 30 గ్రామాలు సీఆర్డీఏ లో అదనంగా కలిశాయి.

బిసిల హామీలు నెరవేర్చాలి:ఉమా

 చేతివృత్తిదార్లకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయ వాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన చేతివృత్తిదారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్‌ రంగంలో బిసిలకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాం డ్‌ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బిసిలకిచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిం చారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచర ణకు నోచడం లేదన్నారు.

SFI కలెక్టరేట్ల ముట్టడి..

రాష్ట్రంలోని హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికిస్తున్న మెస్‌ ఛార్జీ రూ.750 నుంచి రూ.1500లకు పెంచాలని, 50 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారనే సాకుతో మూసివేసిన 220 హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మంగళవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు. అనంతపురం, కర్నూలు, కడప కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. కర్నూల్లో పదిమందిని అరెస్టు చేశారు. అనంతపురంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్‌ చేరుకొని ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు గేట్లు ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

సిపిఎం ఆధ్వర్యాన గిరిజనుల భూపోరాటం..

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో గిరిజనులు మంగళవారం భూ పోరాటం చేశారు. సిపిఎం ఆధ్వర్యాన 60 ఎకరాల సీలింగ్‌ భూముల్లో జెండాలు పాతారు. ఆ భూమిలోని తుప్పలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. 

బిజెపివి విచ్ఛిన్నరాజకీయాలు..

సోమవారం సిపిఎం నేత హరికిషన్‌సింగ్‌ సూర్జీత్‌ 7వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీి అధికారంలోకి వచ్చాక బిజెపి ప్రజల్ని కుల, మత ప్రాతిపదికన విడగొట్టి పబ్బం గడుపుకొంటుందనీ ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణ ఆర్థికవిధానాల ఫలితంగా పేద,ధనిక వర్గాల మధ్య అంతరం రోజురోజుకి పెరిగి పోతుందన్నారు.భారత్‌లో సుమారు 90 శాతం కుటుంబాలు నెలకు కేవలం పది వేలు మాత్రమే సంపాది స్తున్నాయని, అదే సమయంలో ఒక వంద కుటుంబాల ఆదాయం దేశ జిడిపిలో సగానికి పైగా ఉంటుందనీ ఆయన తెలిపారు. 

హిందూత్వ వెనుక కుల వైరస్‌

హిందూ జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? ప్రధానికి సంబంధించినంత వరకు ఇది నిరర్థకమైన ప్రశ్న కాదు. మరో కారణం రీత్యా ఇదొక నిరర్థకమైన ప్రశ్న. రాజ్యాగాన్ని అనుసరించి భారతదేశం ఎన్నటికీ హిందూ దేశం కాబోదు. ఒక జాతి రాజ్యంగా ఇది రాజకీయంగా మతంతో ఎలాంటి సంబంధంలేనిదిగా ఉండి తీరాలి. ఇదే ప్రశ్నను మరో రకంగా కూడా చెప్పవచ్చు. లౌకికవాద ''భారతీయ'' జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? గీతా ప్రెస్‌ ప్రచురణలననుసరించి గట్టిగా 'కాదు' అనే వస్తుంది. వారి సిద్ధాంతం హిందూ జాతీయవాదం. వారి లక్ష్యం హిందూ భారతదేశం.

ప్రకాశం జిల్లా కమిటి సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు

Pages

Subscribe to RSS - September