
డిఎస్‌సి -2014 ఫలితాలపై ప్రభుత్వం వెంటనే మెరిట్ లిస్టు ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మాధవ్, ఎం.సూర్యారావు ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట ఉన్న ఉపాధ్యాయులతోనే సరిపెట్టి, మిగిలిన వారిని వేరే శాఖలో నియమిస్తామని చెబుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో క్వాలిఫెడ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉమారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ లిస్టు ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.