September

వికృత రూపాల్లో మతవాద దాడి..

శుక్రవారం నాడు బిజెపి కేంద్ర మంత్రులు చాలా అట్టహాసంగా నెహ్రూ మ్యూజియం లైబ్రరీలో విజయోత్సవం జరుపుకొన్నారు. అంతకు ముందు దానికి డైరెక్టరుగా ఉన్న మహేష్‌ రంగరాజన్‌ను వదిలించుకున్న సంతోషమది. ఆ ఊపులో మాజీ జనసంఘం అధ్యక్షుడైన దీన దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు ప్రకటించడమే గాక ఆయన సిద్ధాంతంగా చలామణిలో ఉన్న సమగ్ర మానవతావాదం(ఇంటిగ్రల్‌ హ్యూమనిజం)పై పరిశోధన జరగాలని ప్రకటించారు. సరిగ్గా అదే రోజున వెంకయ్య నాయుడు హైదరాబాదులో దీనదయాళ్‌పై ఒక పుస్తకం విడుదల చేస్తూ కమ్యూనిజం విఫల మైందని, దేశంలో ఆ సిద్ధాంతాన్ని అనుసరించే పార్టీలకు స్థానం లేకుండా పోయిందని ప్రకటించారు. ''బెంగాల్‌ కంచుకోట బద్దలై పోయింది.

శరణార్థుల సమస్యకు కారణమేంటి?

 ఐరోపా నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య శరణార్థులు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం తరువాత ఇంత పెద్దయెత్తున ఈ సంక్షోభం ముందుకు రావడం ఇదే మొదటిసారి. సిరియాపై నాటో కూటమి బాంబు దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ సమస్య ముందుకొచ్చింది. వేలు, లక్షల సంఖ్యలో శరణార్థులు ఇతర దేశాలకు తరలివెళ్లే ప్రస్తుత దుస్థితికి కారణం సిరియాలో అసద్‌ ప్రభుత్వం ఎంత మాత్రం కాదు. ఆ దేశంపై దండెత్తిన నాటో దేశాల కుట్రపూరిత విధానమే కారణం. నాటో కూటమి మధ్య ప్రాచ్యంలోని తన అరబ్‌ మిత్రదేశాలతో కలిసి సిరియాపై యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో లక్షలాది మంది సిరియన్‌ పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నారు.

పెరుగుతున్నధరలు-ప్రతికూల ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రభుత్వా ధికారులు విశ్లేషణలు చేస్తున్నారు. హోల్‌సేల్‌ ధరల సూచి 2014 జులై కన్నా 2015 జులైలో 4.05 శాతం తక్కువగా నమోదయిందని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవ చ్చునని, కాబట్టి ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు డిమాండు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వు బ్యాంక్‌ ఈ నెల 17-18 తేదీలలో జరిగే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటుందని పారిశ్రామికవేత్తలు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భగత్‌ విప్లవ వీరుడు:మిడియం

 భగత్‌సింగ్‌ స్ఫూర్తితో సమస్యలపై విద్యార్థులు ఉద్యమాల్లో ముందుండాలని మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపు నిచ్చారు. భగత్‌సింగ్‌ 108వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎజిహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కారం నాగేశ్వరావు అధ్యక్షతన ఆదివారం సభ జరిగింది. మిడియం మాట్లాడుతూ నాడు భారతదేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యువకిషోరం భగత్‌సింగ్‌ అని ఆయన కొనియాడారు. యువకుల్లో విప్లవాన్ని రగిలించి, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వెరవకుండా తీవ్రమైన పోరాటాన్ని నడిపించారని. 1907లో జన్మించిన భగత్‌సింగ్‌ భరతమాత విముక్తే ధ్యేయంగా 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడారని చెప్పారు.

ప్రమాదంలో ప్రభుత్వ విద్య: SFI

ప్రభుత్వ విద్యారంగాన్ని నూతన విద్యాసంస్కరణల పేరుతో టిడిపి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 రోజులపాటు నిర్వహించిన 'విద్యాపరిరక్షణ సైకిల్‌యాత్ర' ముగింపు సభ ఆదివారం స్థానిక జగన్నాథపురం చర్చిస్క్వేర్‌ వద్ద జరిగింది. సభలో రాము మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. నూతన సంస్కరణల పేరుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని విమర్శించారు.

గిరిజనులకు ఉచిత వైద్యపరీక్షలు..

 చింతూరు మండలంలో సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యశిబిరంలో ఆదివారం 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురిని మలేరియా బాధితులుగా గుర్తించారు. ఆదివారం వివిధ గ్రామాలకు చెందిన 100 మంది వైద్యశిబిరానికి వచ్చారు. వారిలో ఐదుగురు మలేరియా బాధితులు ఉన్నారని సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు తెలిపారు.రోజురోజుకూ వైద్యశిబిరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, వారందరికీ తగిన వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.

 

ఇంటికే ఉద్యోగం మరో మోసం:DYFI

ప్రజల వద్దకే ఉద్యోగం అని సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించడం మరో మోసమని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. సూర్యారావు విమర్శించారు. ఈ మేరకు ఇంటికే ఉద్యోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు డివైఎఫ్‌ఐ బహిరంగ లేఖ రాసింది. రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులను ముందుగా భర్తీ చేయాలని సూర్యారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా తిరుమల తిరుపతి ఆలయంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్తియ అభియాన్‌ కింద మన రాష్ట్రానికి 752 ఉద్యోగాలు కేటాయించిందన్నారు.

పుస్తకావిష్కరణ చేసిన మధు..

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ "భూబ్యాంక్ బండారం..కార్పోరేట్లకు పందేరం" అనే పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమక్ష్యంలో విడుదలచేసారు.

Pages

Subscribe to RSS - September