నేను మలాల పుస్తకావిష్కరణ సభలో ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి

అతిచిన్న వయస్సులోనే తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవటమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలు అభివృద్ధివైపు పయనించాలంటే విద్యకు మించిన మార్గం లేదని మలాల ఇచ్చిన పిలుపును మనమంతా అందిపుచ్చుకోవాలని ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. సోమవారం వివిఐటి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రపంచ దేశాలు యుద్దాలకు ఖర్చుపెట్టే సొమ్మును విద్యాభివృద్ధికి మళ్లించాలని చెప్పిన మలాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ ఎడిటర్‌ ఉషారాణి మాట్లాడుతూ మతం పేరిట తాలిబన్లు చదువు వద్దని, ఇంటినుండి బయటకి రావద్దని బురకా ధరించాలని ఆక్షంలు విధిస్తున్న పిదప మనదేశంలోనూ మతోన్మాదులు మహిళలు పట్ల అనేక ఆంక్షలు విధిస్తుండటం బాధకరమైనప అంశమన్నారు. అయితే ఇటువంటి ఆంక్షలను ఎదిరించిన మలాలను తాలిబన్లు మలాలపై కాల్పులు జరిపినప్పటికీ భయపడకుండా ఎదురుతిరిగి నిలవటం సామాన్యమైన విషయం కాదన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లికార్జునుడు, వొరప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.