
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు అడ్డుకునే కుట్రలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డెరైక్షన్ మేరకే.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు యాక్షన్ చేస్తున్నారని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఆపాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. వారితో చెట్టాపట్టాలేసుకొని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి నేతలు ధర్నాలకు దిగడమే ఇందుకు నిదర్శనమన్నారు.