తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట దీక్ష

రాజధాని శంకుస్థాపన కోసం రూ. 50 కోట్లు ఖర్చుచేస్తున్న ముఖ్యమంత్రికి అసైన్డ్‌, సీలింగ్‌ భూముల సాగుదారుల ఆకలికేకలు వినిపించడం లేదా అని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు ప్రశ్నించారు. బాధితులకు కౌలుచెక్కుల చెల్లింపుపై ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తుళ్ళూరు క్రిడా కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో అసైన్డ్‌, సీలింగ్‌ సాగుదారుల దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించారు. రాజధాని ప్రాంత పేదల సమస్యలు పరిష్కరించకుండా తీవ్రమైన అణచివేతకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్‌ నుండి ఇవ్వాల్సిన పెన్షన్‌ ఇవ్వకుండా విచారణ పేరుతో లబ్ధిదారులను కుదించడం అన్యాయమన్నారు.