దోషులను బోనులో నిలబెడతాం

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">                'విశాఖ జిల్లా సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావించడం నేరమా? చదువుకునే వాతావరణం కలుగజేసేందుకు సమస్యలను పరిష్కారం చేయమని అడిగితే అణచివేయడమే సమాధానమా? ఉద్యమాల సందర్భంగా లాఠీఛార్జి వంటివి జరిగితే తప్పుచేశామని ఒప్పుకునే అలవాటు పోలీస్‌ ఉన్నతాధికారుల్లో కనిపించేది.. కానీ ఈ నెల 15న విద్యార్థులు, విద్యార్థినులపైకి పోలీసు అధికారులు దుడ్డుకర్రలతో పైశాచికంగా కొట్టినా ఈ ఘటనను టీవీలు, పత్రికల్లో చూసినా పోలీస్‌, జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం మిన్నకుండడం న్యాయం కాదు.. చేసిన తప్పును ఒప్పుకోకపోతే.. వీటన్నింటినీ మానవ హక్కుల కమిషన్‌కు నివేదిస్తాం.. దోషులను బోను ఎక్కిస్తాం..' అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్‌.నర్సింగరావుతో పాటు వివిధ పార్టీల నేతలు ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలో సరస్వతి పార్కు నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌, న్యూడెమక్రసీ, వైసిపి, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా తదితర పార్టీల ఆధ్వర్యాన భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, సమస్యలపై పోరాడే హక్కు విద్యార్థులకు లేదా? అని, సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, హాస్టళ్లలో సౌకర్యాల కల్పన ప్రభుత్వ బాధ్యతని, అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని నేతలు పేర్కొన్నారు. సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌, వైసిపి జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, లోక్‌సత్తా నేత వేణుగోపాల్‌, ఆమ్‌ఆద్మీనేత నాగూరు వలీ తదితరులు ప్రసంగించారు.