2015

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, విపక్ష నేతలు సమావేశాలకు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, ఇటీవల వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి చేసిన రాజీనామాను ఆమోదించినట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో కడియం ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వ్యాపంపై ఫిర్యాదుచేస్తే బదిలీ

బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విక్రమ్‌ వర్మ మీద సిబిఐకి ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వ వైద్యుడు ఆనంద్‌ రారుని ఇండోర్‌ నుంచి ధార్‌ జిల్లాకు బదిలీ చేశారు. ఘజియాబాద్‌లోని సంతోష్‌ మెడికల్‌ కాలేజిలో ఎంబిబిఎస్‌ సీటు వచ్చిన కుమార్తెను విక్రమ్‌ వర్మ తన పలుకు బడిని ఉపయోగించి భోపాల్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజికి బదిలీ చేయించుకున్నారని ఆరోపిస్తూ రారు సిబిఐ ముందు ఒక ఫిర్యా దు దాఖలు చేశారు. ఇండోర్‌లోని ఆరోగ్య శాఖకు చెందిన ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డెప్యుటేషన్‌ మీద వచ్చిన ఆయన్ని ఆదివారం బదిలీ చేశారు..

ఆత్మహత్యల 'భారతం'

 భాతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ముందుకు రావడం ఆందోళన కలిగించే విషయం. పలు కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి లక్షకు మించి పోవడం కలచివేసే అంశం. కొన్నేళ్లుగా ఆత్మహత్యల పరంపర కొనసాగడంపై ఏలికలు తేలిగ్గా తీసుకోవడం దారుణం. ఏదైనా ప్రమాదంలోనో, హఠాత్తుగా సంభవించే అనారోగ్యంతోనో చనిపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం బాధాకరం కాగా, అలాంటి వారు వేలు దాటి లక్షలకు చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

ఐరోపా అసలు స్వరూపం..

 గ్రీకు ప్రజలు కేవలం ఒక వారం క్రితం రిఫరెండంలో తిరస్క రించిన 'పొదుపు ప్యాకేజీ'ని ప్రధాని అలెక్సీ సిప్రాస్‌ అంగీకరిం చటమంటే గ్రీక్‌ ప్రభుత్వం లొంగిపోవ టమే. గ్రీకు ప్రజలంటే జర్మన్‌ ద్రవ్య పెట్టుబడికున్న చిన్నచూపుకు ఇది ఒక సూచిక. వాస్తవంలో ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికి ఇది ఒక నిర్ణయాత్మకమైన మలుపు. వామపక్షాల ముఖ్యంగా యూరోపియన్‌ వామపక్షాల ఆలోచనా ధోరణికి ఇది ఒక ముగింపు. గ్రీస్‌ ప్రధాని అలెక్సీ సిప్రాస్‌ షరతులను అంగీకరించటమా, లేదా అనేది అసలు విషయం కాదు. యూరోపియన్‌ వామపక్షాలు తమను తాము పరిమితం చేసుకున్న వ్యవహార శైలిలో సిప్రాస్‌కు అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు.

స్వచ్ఛ భారత్‌లో స్కాంల పర్వం..

ఇటీవల వెలుగులోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుంభకోణాలు బిజెపిని బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న భారీ వ్యాపం కుంభకోణం, లలిత్‌మోడీ కుంభకోణం, శృతి ఇరానీ లాంటి వారి విద్యార్హతలకు సంబంధించిన సమస్యలు బిజెపికి గుబులుపుట్టిస్తున్నాయి. బిజెపి నేతలు కుంభకోణాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అవినీతిలేని పాలన అందిస్తామని బిజెపి నాయకులు ఊదరగొట్టారు. కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. వ్యాపం స్కామ్‌లో ఆ పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు భాగస్వామ్యం ఉందంటూ వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

అవినీతిపై సమర శంఖం:CPM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనను నిరసిస్తూ, అవినీతి వ్యతిరేక దినంలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమవారం వివిధ రూపాల్లో ఆందోళనలు, సదస్సులు జరిగాయి. విశాఖలో జరిగిన సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించే నైతిక హక్కు ఇంకెంతమాత్రమూ లేదని , పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలేసే సమయంలో నిజాయితీగలవారైతే రాజీనామాలు చేయాలని, లేదంటే ప్రభుత్వమే వారిపై చర్య తీసుకోవాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. 

ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్‌ను అటకెక్కించింది చంద్రబాబే:మధు

మున్సిపల్‌ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మున్సిపల్‌ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు.

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి-రాఘవులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలో భాగంగా విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఈ సమ్మెకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ప్రైవేటీకరణ పేరుతో మున్సిపాలిటీలను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు.

విశాఖ కెజిహెచ్ హాస్పటల్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సిగ్గుచేటు ...

విశాఖ కెజిహెచ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ సిపియం పార్టీ ఆద్వర్యంలో  సంతాల సేకరణలో పాల్గొన్న బి.వి.రాఘవులు ... 

BJP, TDP ప్రభుత్వాల అవినీతిపై సమర శంఖారావం పూరించండి ..

ఈ రోజు విశాఖ లో జరిగిన అవినీతి వ్యతిరేక సభలో బి.వి. రాఘవులు గారు మాట్లాడుతూ ... ఏడాది కాలంలోనే తాము అవినీతి పార్టీలేనని బిజెపి, టిడిపి  రుజువు చేశాయన్నారు. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన కాంగ్రెస్ కు భిన్నంగా నీతిమంతమైన పాలన అందిస్తామని ప్రచారం చేసారు. అధికారం చేపట్టిన నాటి నుండి బిజెపి, టిడిపి కాంగ్రెస్ దారిలోనే నడుస్తున్నాయి . దేశ, విదేశ భాహుళజాతి కంపెనీలు వేలకోట్లు ఖర్చుపెట్టి  బిజెపిని గెలుపించుకున్నయన్నారు.  గెలిచినా తరువాత వారి రుణం తీర్చుకుంటున్నాడు  మోడీ . అందువలనే  దొంగల ముటాకు సహకరించడం, తద్వారా  తాము  వాటాలు పంచుకుంటున్నారు.

Pages

Subscribe to RSS - 2015