
బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విక్రమ్ వర్మ మీద సిబిఐకి ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ రారుని ఇండోర్ నుంచి ధార్ జిల్లాకు బదిలీ చేశారు. ఘజియాబాద్‌లోని సంతోష్ మెడికల్ కాలేజిలో ఎంబిబిఎస్ సీటు వచ్చిన కుమార్తెను విక్రమ్ వర్మ తన పలుకు బడిని ఉపయోగించి భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజికి బదిలీ చేయించుకున్నారని ఆరోపిస్తూ రారు సిబిఐ ముందు ఒక ఫిర్యా దు దాఖలు చేశారు. ఇండోర్‌లోని ఆరోగ్య శాఖకు చెందిన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు డెప్యుటేషన్ మీద వచ్చిన ఆయన్ని ఆదివారం బదిలీ చేశారు.. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయమని సుప్రీం కోర్టు ఆదేశించి తర్వాత సిబిఐ 12 కేసులను నమోదు చేసింది.