అ...అమ్మ, ఆ...ఆవు' అని చెప్పుకునే రోజులు పోయాయి. 'అ...అవినీతి, ఆ...ఆశ్రిత పక్షపాతం' అనుకోవాల్సిన కాలం వచ్చేసింది. మాది భిన్నమైన పార్టీ. స్వచ్ఛమైన పార్టీ అంటూ జనాన్ని నమ్మించి మరీ గద్దెనెక్కిన బి.జె.పి వారూ తక్కువ తినలేదని నిరూపితమౌతోంది. మోడీ గేట్, వ్యాపమ్ స్కామ్, చిక్కీ కుంభకోణం, అగ్నిమాపకాల కొనుగోళ్ల స్కామ్ ఓ వైపు, నకిలీ సర్టిఫికెట్లు- అక్రమ చదువుల ఆరోపణలు మరోవైపు కమలనాథులకు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నాయి.