2015

ప్రజలకు అండగా నిలుస్తాం..

మాస్టర్‌ప్లాను నివేదిక ప్రకారం ప్రసుత్తం గ్రామాలు తరలిస్తామంటున్నారని, రేపు ఉన్న ప్రజలనూ తరలించేస్తారని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు అన్నారు. గ్రామాల్లో రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు నవీన్‌ప్రకాష్‌తో కలిసి పర్యటించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళనకు దిగడంతో ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ ఊరుకునేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు.

సెప్టెంబర్‌ 2న సమ్మె యథాతథం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల సమస్యలు, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న సమ్మె ప్రకటించిన ప్రకారం సాగుతుందని సిఐటియు జాతీయ కార్యదర్శి డా|| హేమలత స్పష్టంచేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్మిక సదస్సు మంగళవారం ముగిసింది. ఇందులో సెంటర్‌ ఫర్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌(సిఐటియు) తరపున పాల్గొన్న హేమలత మీడియాతో మాట్లాడుతూ...దేశంలో ఉన్న పదకొండు జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగానే ఉన్నాయని...సమ్మె ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో జాతీయ సమ్మెపై సదస్సులు జరిగాయని గుర్తుచేశారు.

రాజ్యసభలో మళ్లీ రగడ

 రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్ కురియన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ హమిద్ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు.

ఎంపిల ఆతిధ్యానికి 24కోట్లు

కేంద్రం 47 మంది ఎంపీల బస నిమిత్తం ఇటీవల రూ.24 కోట్లు చెల్లించింది. బీజేపీ, కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరంతా ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో, ప్రభుత్వ అతిథిగృహా ల్లో 14 నెలలుగా ఆతిథ్యం పొందుతున్నారు. సాధారణంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ప్రభుత్వం 30 రోజుల్లోగా ఢిల్లీలో ఫ్లాట్లు కేటాయించాలి. అప్పటివరకు వారి తాత్కాలిక బసకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, 10 మందికి కేటాయించిన భవనాలు నివాసయోగ్యమే అయినా, వారు వాటిలోకి మారనందువల్ల భారం పడుతోంది.  

హోదా సాధించకపోతేప్రతిఘటనే

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తిరిగొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయించలేని పక్షంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక లెనిన్‌ సెంటర్లో మంగళవారం మాక్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు.

200మంది పారిశుధ్యకార్మికుల అరెస్టు

తమ డిమాండ్లు నెరవేర్చాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మంగళవారానికి 11 రోజులు పూర్తిచేసుకుంది. ఓపక్క పోరాటం ఉధృతంగా మారుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోగా విజయవాడలో పారిశుధ్య కార్మికులు మంగళవారం చేపట్టిన రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్‌ అధికారుల బంగ్లాల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టులకు తెగబడింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి 200 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. మహిళలనీ చూడక ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు.

నేడు రాజమండ్రిలో కేబినెట్ సమావేశం

ఏపీ మంత్రిమండలి సమావేశం రాజమండ్రిలో బుధవారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగా మారింది.  మంగళవారం రాత్రికే మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా సీనియర్‌ ఐఎఎ్‌సలంతా రాజమండ్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పది గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించి.. ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో రాజమండ్రి అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది.

సింగపూర్‌కు లక్షకోట్లు నజరానా..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ కోసం టిడిపి ప్రభుత్వం సింగపూర్‌కు లక్ష కోట్లు నజరానా ఇచ్చిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయడానికి సింగపూరేమైనా దార్మిక సంస్ధా అని ప్రశ్నించారు. మాస్లర్‌ ప్లాన్‌ను ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్‌ తెలుగుదేశం పార్టీ నేతలకు సింగపూర్‌ మేనమామనా అని మండిపడ్డారు. సింగపూర్‌ పెద్ద బిజినెస్‌ ( వ్యాపార ) దేశమని, మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు ప్రీగా ఇస్తుందని అన్నారు.

జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు..

తెలంగాణాలో రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యకార్డుల దస్త్రంపై సీఎం సంతకం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు త్వరగా అందేలా చూడాలని రమణాచారి, అల్లం నారాయణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Pages

Subscribe to RSS - 2015