2015

సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం:మధు

విజయవాడ:సింగపూర్‌ ఇంజనీర్లు తయారుచేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీర్లు తయారు చేయలేరన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి ఇంజనీర్లను అవమానించారన్న మధు.. ఈ ముఖ్యమంత్రికన్నా సింగపూర్‌ మంత్రులే మేలన్న విషయాన్ని చంద్రబాబే పరోక్షంగా ప్రకటించినట్లు అయిందని ఎద్దేవా చేశారు.

రెండంకెల వృద్ధి సాధ్యమా..!

రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి (డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌) సాధిస్తామనీ, దానికోసం అన్ని ఏర్పాట్లూ చేశామనీ ప్రచార హోరు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తే 'ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు' ఉంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని అరికట్టలేని ప్రభుత్వం మరి రెండంకెల ప్రగతి గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? గడిచిన దశాబ ్దకాలంలో కనీసం 4 శాతం వృద్ధి రేటు సాధించలేక పోయాము. ఇప్పుడు ఏకంగా రెండంకెల ప్రగతి సాధిస్తామని చెబుతున్నారు.

జంషెడ్‌పూర్‌ మత ఉద్రిక్తతలపై సిపిఎం ఆందోళన

 రాంచి : ఉక్కు నగరమైన జంషెడ్‌పూర్‌లో తలెత్తిన మత ఉద్రిక్తతలపై సిపిఎం జార్ఖండ్‌ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని మాంగో ఏరియాలో శాంతి భద్రతలకు సంబంధించిన ఒక సంఘటన వల్ల మత ఉద్రిక్తత నెలకొందని పేర్కొంది. బిజెపికి చెందిన మతోన్మాద సంస్థలు నగరమంతటా మత సామరస్యతను దెబ్బ తీస్తున్నాయని, ఆ సంస్థల నేరపూరితమైన, రెచ్చ గొట్టే కార్యకలాపాల వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారుతోందని పేర్కొంది. దీనిపై మౌనంగా ఉండడం ద్వారా ప్రభుత్వం ఆ శక్తులను పరోక్షంగా ప్రోత్సహి స్తున్నట్లు వుందని పేర్కొంది. 
 

చతికిలపడుతున్న చిన్నపరిశ్రమల రంగం

పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించే చిన్న పరిశ్రమల పరిస్థితి నయా ఉదారవాద విధానాల యుగంలో పరమ అధ్వానంగా తయారైందని ఎంతమంది మొత్తుకున్నా పెడ చెవిన పెట్టిన పాలకులకు సరికొత్త సర్వేలు కళ్ళు తెరిపిస్తాయి అనుకోవాలి. చాలా పరిశ్రమలు ఇప్పటికే దివాళా తీయగా, మరి కొన్ని ఈసురోమంటూ మూతపడే దిశలో వున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా ఆచరణలో సేల్‌ ఇన్‌ ఇండియాగా మారిపోయింది.

చనిపోతాం..అనుమతించండి..!

‘మా ఆత్మ గౌరవాన్నయినా పునరుద్ధరించండి.. లేదా మమ్మల్ని చనిపోవడానికైనా అనుమతించండి’ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఈ అప్పీల్ చేసింది ఎవరోకాదు. మధ్యప్రదేశ్‌ను కుదిపేస్తున్న వ్యాపం కుంభకోణం బాధిత విద్యార్థులు. ప్రీమెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులపై అనేక రకాలుగా ఛీటింగ్ ఆరోపణలు రావడంతో ఈ భావోద్వేగపూరిత అప్పీల్ చేశారు. తాము స్వీయ ప్రతిభతో ప్రవేశ పరీక్షల్లో పాస్ అయినప్పటికీ అక్రమ మార్గంలోనే అడ్మిషన్లు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

రాహుల్ని వాజపేయి విడిపించారు

బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వా మి  రాహుల్ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001వ సంవత్సరంలో అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ వద్ద 1.60 లక్షల డాలర్ల నగదు, వైట్ పౌడర్ ఉండటంతో అతన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అధికారులు పట్టుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయికి ఫోన్ చేయగా, వాజపేయి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు ఫోన్ చేశారని, దాంతో ఎఫ్‌బిఐ అధికారులు రాహుల్ గాంధీని వదిలివేశారని సుబ్రహ్మణ్య స్వామిని ఉటంకిస్తూ ఒక హిందీ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.

తొక్కిసలాట క్రైస్తవసంఘాలకుట్రే

పుష్కరాల వైఫల్యానికి మాజీ ఎంపీ హర్షకుమార్‌తోపాటు కొన్ని క్రైస్తవ సంఘాలు కుట్ర పన్నాయని శ్రీరామ్‌సేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు రమేష్‌ ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటకు వీరు చేసిన ప్రచారమే కారణమని ఆయన పేర్కొన్నారు. హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని రమేష్‌ చెప్పారు. రాజమండ్రిలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సైతం అనుమానాలున్నాయని రమేష్‌ ఆరోపించారు.

రాష్టప్రతి,గవర్నర్లు అనవసరం

దేశంలోరాష్టప్రతి, గవర్నర్ వ్యవస్థలు గుదిబండలుగా మారయని నారాయణ విమర్శించారు. కేంద్రం చెప్పినట్లు చేయడానికి రాష్టప్రతి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు చేయడానికి గవర్నర్ ఉంటే వారి జీతభత్యాలు ఖర్చుతప్ప దేశానికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరదన్నారు. 

BJP కి ఊహించని షాక్..

బీజేపీకి సొంతపార్టీ నేతలే షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే లలిత్‌ గేట్‌, వ్యాపం తదితర కేసులపై విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు నానాతంటాలు పడుతున్న బిజెపికి ఊహించని విధంగా సొంత పార్టీ నేత నుండే మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేలా కుంభకోణాలు బయటపడడం పార్టీకి సిగ్గుచేటని ఓ బీజేపీ ఎంపీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఉన్నాయని, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం బీజేపీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు.

రాజ్యసభ కోసమే రఘువీరా

రాజ్యసభ సీటు కోసమే రఘువీరా రెడ్డి రాహుల్‌ గాంధీతో పాదయాత్రలు చేయిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మాట్లాడుతూ అనంతపురానికి ఆనుకొని ఉన్న కర్నాటకలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాహుల్‌ గాంధీ అక్కడ ఎందుకు యాత్రలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ లు కేవలం అనంతపురం, హిందూపూర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లోనే ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

Pages

Subscribe to RSS - 2015